PFC Recruitment 2023: Good news for unemployed.. per month Rs. Salary up to 2 lakhs.. Apply now..
PFC Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 2లక్షల వరకూ జీతం.. ఇప్పుడే దరఖాస్తు చేయండి..
ఉద్యోగార్థులకు శుభవార్త. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 29 ఖాళీలను భర్తీ చేయనుంది. వాటిల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల దరఖాస్తుదారులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా జూన్ ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటఫికేషన్ కు సంబంధించిన నపూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఖాళీల వివరాలు..
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనుంది. వాటిల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్ పోస్టులున్నాయి.
అసిస్టెంట్ మేనేజర్(ప్రాజెక్ట్స్)- 1
డిప్యూటీ మేనేజర్(ప్రాజెక్ట్స్)-1
డిప్యూటీ మేనేజర్ ఎనర్జీ ఎఫిషియన్సీ(ప్రాజెక్ట్స్)- 1
డిప్యూటీ మేనేజర్ మానిటరింగ్(ప్రాజెక్ట్స్)- 1
మేనేజర్(ప్రాజెక్ట్స్) – 5
చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్)- 4
డిప్యూటీ మేనేజర్(ఐటీ/ఎంఎస్)- 1
డిప్యూటీ మేనేజర్(ఐటీ/ఎంఎస్)- 5
డిప్యూటీ మేనేజర్(ట్రాన్స్ మిషన్) – 1
డిప్యూటీ మేనేజర్(పవర్ డిస్ట్రిబ్యూషన్)- 1
అసిస్టెంట్ మేనేజర్-ఫైనాన్స్(సీఎఫ్యూ)-1
అసిస్టెంట్ మేనేజర్ – (ఎంటిటీ అప్రైజల్)- 04
అసిస్టెంట్ మేనేజర్ –ఫైనాన్స్(సీఎస్సార్)- 01
అసిస్టెంట్ మేనేజర్ – టెక్నికల్ (సీఎస్సార్)- 01
డిప్యూటీ మేనేజర్ (కార్పొరేట్ రిస్క్ మేనేజ్‌మెంట్)- 02
డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 01
మేనేజర్ (అంతర్గత ఆడిట్)- 01
డిప్యూటీ మేనేజర్ ఇంజనీరింగ్ (ఆర్డీఎస్ఎస్)- 02
దరఖాస్తు చివరి తేదీ.. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2023, జూన్ 06 చివరి తేదీ సాయంత్ర ఐదు గంటల లోపు ఆన్ లైలో దరఖాస్తు చేసుకోవాలి. పీఎఫ్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం.. దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు 500 రూపాయల దరఖాస్తు రుసుంను చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.
వయో పరిమితి.. ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 42. అయితే, వయోపరిమితి కూడా పోస్టులను బట్టి మారుతుంది. అంతే కాకుండా గిరిజనులు, గిరిజనులకు కేంద్ర నిబంధనల మేరకు వయోపరిమితిని సడలించారు.
జీతం.. పోస్టును బట్టి జీతం కూడా భిన్నంగా ఉంటుంది.గరిష్ట జీతం 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
అర్హతలు.. విద్యార్హత కూడా పోస్టుల వారీగా మారుతుంది. కానీ దరఖాస్తుదారులు బీటెక్ లేదా ఎంబీఏ డిగ్రీ కనీస విద్యార్హతగా కలిగి ఉండాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS