NEET Admit Card 2023 : NTA released NEET UG admit cards.. How to download?
NEET Admit Card 2023 : నీట్ యూజీ అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్టిఏ.. డౌన్ లోడ్ చేసుకోవటం ఎలాగంటే ?
NEET Admit Card 2023 : మే 7వతేదిన దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేశారు. నీట్ యూజీ 2023 పరీక్ష దేశవ్యాప్తంగా మొత్తం 499 నగరాల్లోని వివిధ కేంద్రాలలో నిర్వహించబడుతుంది. పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ మరియు పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు.
ఈ సంవత్సరం, 18,72,341 మంది అభ్యర్థులు నీట్ యూజీ 2023 పరీక్షకు హాజరుకానున్నారు. నీట్ యూజీ 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ద్వారా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ మరియు సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ మరియు సర్జరీ (BSMS)లో ప్రవేశానికి అర్హత ప్రవేశ పరీక్ష. ), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), మరియు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) మరియు BSc (H) నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించవచ్చు.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోపలకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్లాస్టిక్ పర్సు, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్‌లు, ఎరేజర్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్/స్కానర్ మొదలైన ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు.
నీట్ యూజీ అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్లోడ్ చేయాలి ;
అడ్మిట్ కార్డ్ ని డౌన్ లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inని సందర్శించండి. హోమ్‌పేజీలో కనిపించే అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ను నమోదు చేయండి. వెంటనే మీ అడ్మిట్ కార్డు వస్తుంది. దానిని సులభంగా డౌన్లోడ్ చేసుకోండి.
COMMENTS