ISRO Recruitment 2023: BE, BTech Job Vacancy Notification Released for Unemployed.
ISRO Recruitment 2023: బీఈ, బీటెక్ నిరుద్యోగులకు సదావకాశం.. ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో.. 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఐసీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఆర్క్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
అభ్యర్ధుల వయసు మే 24, 2023వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మే 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి తుది గడువు మే 26.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (సివిల్) పోస్టులు: 39
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ ‘ (ఎలక్ట్రికల్) పోస్టులు: 14
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (రిఫ్రిజెరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 9
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్) పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్ పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్ పోస్టులు: 1
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS