Indian Navy Jobs: Indian Navy Latest Recruitment..Application Process Begins..!
Indian Navy Jobs: ఇండియన్ నేవీ లేటెస్ట్ రిక్రూట్మెంట్..అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం..!
Indian Navy Jobs: త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ(Indian navy) ఇటీవల వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టగా, తాజాగా ఛార్జ్‌మెన్-II ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ joinindiannavy.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేటి (మే15) నుంచి ప్రారంభం అయింది. ఈ గడువు మే 29తో ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 372 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఛార్జ్‌మెన్ పోస్ట్ అనేది ఇండియన్ నేవీలో టెక్నికల్ డిపార్ట్మెంట్కు సంబంధించినది. నేవీ ఉపయోగించే వివిధ పరికరాలు, యంత్రాలు సజావుగా పనిచేసేలా చూడడం ఛార్జ్‌మెన్ బాధ్యత. ఇందుకోసం నేవీ సిబ్బందితో కలిసి పని చేస్తారు.
ఖాళీల వివరాలు
ఎలక్ట్రికల్- 42
వెపన్- 59
ఇంజనీరింగ్- 141
కన్స్ట్రక్షన్ అండ్ మెయిన్టెన్స్- 115
ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ గ్రూప్- 12
అర్హతలు
ఛార్జ్‌మెన్-II రిక్రూట్మెంట్కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి సైన్స్‌లో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్
ఇండియన్ నేవీ అధికారిక పోర్టల్ joinindiannavy.gov.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, Join Navy అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ సివిలియన్, తర్వాత ఛార్జ్‌మెన్-II అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.278 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. రెండో రౌండ్లో ఇంటర్వ్యూ ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహిస్తారు. తరువాతి దశలో ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST) & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఉంటుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం లభిస్తుంది. నేవీ రూల్స్ ప్రకారం.. అలవెన్స్‌లు ఉంటాయి.
ఎగ్జామ్ ప్యాట్రన్
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్,
జనరల్ ఇంగ్లీష్ సెక్షన్స్ నుంచి 10 మార్కుల చొప్పున ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 20, స్పెసిఫిక్ పోస్ట్ 50 మార్కులకు ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS