HLL Lifecare Jobs 2023: Opportunity to get central qualifications without written exam.. These qualifications are enough..
HLL Lifecare Jobs 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే చాలు..
భారత ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. 59 హిందీ ట్రాన్స్‌లేటర్, ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెరిటరీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సేల్స్ / మార్కెటింగ్ / బిజినెస్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ ఎంఏ/ ఎంబీఏ/ ఎంకామ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 37 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 15, 2023వ తేదీలోపు కింది ఈమెయిల్ ఐడీకి దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్‌తోపాటు సంబంధిత డాక్యుమెంట్లను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించాలి.
అకడమిక్ క్వాలిఫికేషన్, స్కిల్స్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.32,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ..
marketing@lifecarehll.com.
అడ్రస్..
DGM (HR & ADMIN) HLL Lifecare Limited HLL Bhavan, #26/4 Velachery – Tambaram Main Road Pallikaranai, Chennai – 600 100.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS