HAL Jobs: Apprentice posts in central government organization with ITI qualification.. Selection without any written test
HAL Jobs: ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న 178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 178 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఐటీఐ ట్రేడ్ పోస్టులు ఉన్నాయి.
* విభాగాల వారీగా వస్తే.. ఎలక్ట్రానిక్ మెకానిక్ (76), ఫిట్టర్ (25), ఎలక్ట్రిషియన్ (08), మెషనిస్ట్ (08), టర్నర్ (07), వెల్డర్ (02), రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ (02), సీఓపీఏ (40), ప్లంబర్ (02), పెయింటర్ (04), డీజిల్ మెకానిక్ (01), మోటర్ వెహికిల్ మెకానిక్ (01), సివిల్ (01), మెకానికల్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులు ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఇందులో సంబంధిత అకడమిక్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
* అనంతరం అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS