FACT Recruitment 2023: In this Central Government Fertilizer Company, the measurements are with a salary of 2 lakhs.
FACT Recruitment 2023: ఈ కేంద్ర ప్రభుత్వ ఎరువుల కంపెనీలో 2 లక్షల జీతంతో కొలువులు..
కేరళలోని కొచ్చిలో ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్.. 74 సీనియర్ మేనేజర్ (సివిల్), సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్), ఆఫీసర్ (సేల్స్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సేల్స్, ప్రాసెస్, హ్యూమన్ రిసోర్స్, సివిల్, ఫిట్టర్ కమ్ మెకానిక్, క్రాఫ్ట్స్‌మ్యాన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మొదలైన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదోతరగతి/సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/బీఎస్సీ/పోస్టు గ్రాడ్యుయేషణ్/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
అభ్యర్ధుల వయసు 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా మే 16, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీబీటీ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.19,500ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- సీనియర్ మేనేజర్ (సివిల్)
- సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్)
- ఆఫీసర్ (సేల్స్)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)
- టెక్నీషియన్ (ప్రాసెస్)
- శానిటరీ ఇన్‌స్పెక్టర్
- క్రాఫ్ట్స్‌మ్యాన్ (ఫిట్టర్ కమ్ మెకానిక్)
- క్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)
- క్రాఫ్ట్స్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)
- క్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS