DVC Recruitment: Notification for 92 Engineer Jobs in Damodar Valley.. Salary Rs.1,12,400 per month
DVC Recruitment: దామోదర్ వ్యాలీలో 92 ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.1,12,400ల జీతం
కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పరిధిలోని పశ్చిమ్ బెంగాల్/ ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు/ స్టేషన్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు, 52 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మెకానికల్, ఎలక్ట్రికల్, సి అండ్ ఐ, సివిల్, కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జూనియర్ ఇంజినీర్ పోస్టులకైతే కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు.. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ (అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR JUNIOR ENGINEER NOTIFICATION CLICKHERE
FOR ASSISTANT ENGINEER, ASSISTANT MANAGER NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS