CIPET 2023: Excellent opportunities in the field of plastics.. Invitation to applications for Diploma and Post Graduate Diploma courses.. Eligibility..!
CIPET 2023: ప్లాస్టిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు.. డిప్లమో, పోస్ట్ గ్యాడ్యుయేట్ డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలివే..!
నలుగురూ వెళ్లే దారిలో కంటే మనం ప్రత్యేకతను నిరూపించుకునేలా వేరే దారిలో వెళ్తే జీవితంలో సక్సెస్ కావడం చాలా ఈజీ. అయితే ఈ సూత్రాన్ని అనుసరించే చాలా మంది చదువుకునే సమయం నుంచే వినూత్న కోర్సుల్లో చేరుతూ చాలా ఈజీగా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలం మనం వాడే ప్రతి అవసరానికి ప్లాస్టిక్ అనేది కంపల్సరీగా మారింది. గృహోపకరణాలు, ఫోన్లు, వంట సామగ్రి ఇలా ఒకటేంటి ప్రతి వస్తువుకు ప్లాస్టిక్ అనేది తప్పనిసరైంది. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి దేశ, విదేశాల్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ రంగంలో పని చేసేందుకు నిపుణుల కొరత మాత్రం వేధిస్తూనే ఉంది.
అద్భుతమైన అవకాశాలు ఉన్న ఈ రంగంలో నిపుణులను తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) లాంచ్ చేసింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) సహాయంతో 1968లో భారత ప్రభుత్వం దీన్ని చెన్నైలో స్థాపించింది. ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ విభాగాల్లో నిపుణలైన ఉద్యోగులను అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దేశంలోని 22 రాష్ట్రాల్లో 39 సెంటర్లను ప్రస్తుతం సీపెట్ ఉంది.
మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లో కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సీపెట్ పదో తరగతి పాసైన విద్యార్థుల కోసం మూడేళ్ల డిప్లమో కోర్సులను, బీఎస్సీ విద్యార్థుల కోసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లోని కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా సీపెట్ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలను ఓ సారి చూద్దాం.
డిప్లమో కోర్సులు
ప్రస్తుతం సీపెట్ రెండు రకాలు డిప్లమో కోర్సులను అందిస్తుంది. డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీల్లో డిప్లమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరడానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఈ కోర్సుల్లో చేరడానికి వయోపరిమితి లేదు. మూడేళ్లపాటు ఉండే ఈ కోర్సులో మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు అందించే ఫీజురీయింబర్స్‌మెంట్ పొందడానికి కూడా అర్హత ఉంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్సు
డిగ్రీ బీఎస్సీ పాసైన విద్యార్థులు రేండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సును సీపెట్ రూపొందించింది. ఈ కోర్సులో చేరడానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువతున్న విద్యార్థులు కూడా అర్హులే.
నోటిఫికేషన్ వివరాలు
సీపెట్ 2023 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే ఈ నెల 24 లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్లికేషన్ సబ్‌మిట్ చేయడానికి మాత్రం ఈ నెల 28 వరకూ సమయం ఉంటుంది. సీపెట్-2023కు అప్లయ్ చేయాలనుకునే విద్యార్థులు ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.250 దరఖాస్తు పూర్తి చేశాక దరఖాస్తు రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 11న సీపెట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ చూపిన వారు వారికి నచ్చిన సీపెట్ కాలేజీల్లో ఎడ్మిషన్ పొందవచ్చు. ఈ కోర్సు గురించి మరిన్ని వివరాలకు విజయవాడ సీపెట్ కేంద్రానికి సంబంధించిన ప్రతినిధి నెంబర్ 93980 50255కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Important Links:
FOR WEBSITE CLICKHERE
FOR REGISTRATION CLICKHERE
COMMENTS