Bank of Baroda: How to select jobs in Bank of Baroda with degree qualification.
Bank of Baroda: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో భాగంగా ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ బిజినెస్), జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ – సీవీ/సీఎంఈ), రీజినల్ సేల్స్ మేనేజర్ (ట్రాక్టర్ లోన్), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ ఫారెక్స్ (ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్), మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ పోస్టులు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మే11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS