Arushi Agarwal: Started the company with a lakh and raised Rs. 50 crore company.
Arushi Agarwal: లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!
'చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, స్థిరపడాలి' ఇది చదువుకున్న చాలా మంది ఆలోచన. అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంత మంది నిరూపిస్తున్నారు.
ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు 'అరుషి అగర్వాల్'. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. ఇది నిజంగానే గొప్ప అద్భుతం అనే చెప్పాలి. కేవలం మూడేళ్ళలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది.
నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది.
భారీ శాలరీ ప్యాకేజి వద్దనుకుని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీని కోసం కోడింగ్ నేర్చుకుంది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మొత్తానికి అనుకున్న విధంగానే రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది.
కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్‌వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాకూండా వారు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లోని 380 కంపెనీలకు సహాయం చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది. అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాత 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
COMMENTS