AIIMS Recruitment: Notification for filling teaching posts in AIIMS.. Selection without written test.
AIIMS Recruitment: ఏయిమ్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తీసుకోనున్నారు. ఈ ఖాళీలు రాయ్ పూర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
* అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఈ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16ని చివరి తేదీగా నిర్ణయించారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS