TS gurukulam Jobs 2023: 2,008 Junior Lecturer Jobs in Telangana Gurukulams.. Online Applications Started
TS gurukulam Jobs 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు.. ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు
తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 2,008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన నిరుద్యోగులు మే 17, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్షలు(పేపర్-1, 2, 3), డెమాన్‌స్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
ఫిజికల్ డైరెక్టర్: 34 పోస్టులు
లైబ్రేరియన్: 50 పోస్టులు
జేఎల్ సబ్జెక్టు వారీగా ఖాళీలు..
తెలుగు సబ్జెక్టు పోస్టులు: 225
హిందీ సబ్జెక్టు పోస్టులు: 20
ఉర్దూ సబ్జెక్టు పోస్టులు: 50
ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 230
మ్యాథ్స్ సబ్జెక్టు పోస్టులు: 324
ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 205
కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 207
బోటనీ సబ్జెక్టు పోస్టులు: 204
జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 199
హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 7
ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 82
కామర్స్ సబ్జెక్టు పోస్టులు: 87
సివిక్స్ సబ్జెక్టు పోస్టులు: 84
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR MORE INFORMATION CLICKHERE
COMMENTS