TREIRB TGT Recruitment 2023: Notification released for 4,006 TGT posts in Telangana Gurukula Schools.
TREIRB TGT Recruitment 2023: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 4,006 టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురుకుల (ఏప్రిల్ 27) విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 4,006 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల్లో 3,012 అంటే 75 శాతం పోస్టులు మహిళలకు కేటాయించనున్నారు. 994 పోస్టులను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. బాలికలు, మహిళా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలతో భర్తీచేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలున్నాయి. కాగా 9,231 పోస్టులకు ఏప్రిల్ 5న గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు 9 నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఎనిమిది ప్రకటనలకు ఇప్పటికే సమగ్ర ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉండాలి. లేదా డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా సంబంధిత లాంగ్వేజీ లేదా ఓరియంటల్ లాంగ్వేజిలో డిగ్రీ లేదా లిటరేచర్‌లో డిగ్రీ లేదా సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50శాతం మార్కులతో పాటు లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి. దీంతో పాటు టెట్-పేపర్-2/సీటీఈటీ అర్హత ఉండాలి. డిగ్రీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 28 నుంచి మే 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. రాతపరీక్ష మూడు పేపర్లుగా 300 మార్కులకు ఉంటుంది. ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షకు వారం రోజుల ముందు మాత్రమే హాల్టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి.
రాత పరీక్ష విధానం..
పేపర్-1లో 100 మార్కులకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్లభాష పరిజ్ఞానంపై ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్‌లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్-2లో 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టులో బోధన (పెడగాజీ ఆఫ్ సబ్జెక్ట్) సామర్థ్యాలపై ఉంటుంది.
పేపర్-3లో 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టు (సబ్జెక్ట్ నాలెడ్జ్) విషయ పరిజ్ఞానంపై ఉంటుంది. ఈ పరీక్ష కేవలం ఇంగ్లీష్లోనే నిర్వహిస్తారు.
టీజీటీ పోస్టుల వివరాలు..
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో పోస్టుల సంఖ్య: 728
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో పోస్టుల సంఖ్య: 218
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీలో పోస్టుల సంఖ్య: 2,379
మైనారిటీస్ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో పోస్టుల సంఖ్య: 594
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పోస్టుల సంఖ్య: 87
Important Links:
FOR WEBSITE CLICKHERE
COMMENTS