TREIRB : 2876 Lecturer Jobs in Telangana.. subject wise vacancy details.
TREIRB : తెలంగాణలో 2876 లెక్చరర్ ఉద్యోగాలు.. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలివే.
TREIRB : తెలంగాణలో లెక్చరర్ ఉద్యోగాల (Telangana Lecturer Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) వెబ్ నోట్ విడుదల చేసింది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ (Lecturer Jobs) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 868 ఉండగా.. 2008 జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయి. మొత్తం కలిపి 2876 ఖాళీలున్నాయి.
ఈ ఖాళీల భర్తీకి సంబంధించి 2023 ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2023 మే 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి రూ.1,37,000 వరకు వేతనం లభిస్తుంది. ఖాళీలు, వయస్సు, కమ్యూనిటీ, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో 2023 ఏప్రిల్ 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్ను TREIRB వెబ్సైట్ https://treirb.telangana.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.
జూనియర్ లెక్చరర్ ఖాళీలు: 2008
తెలుగు- 225
హిందీ- 20
ఉర్దూ- 50
ఇంగ్లీష్- 230
మ్యాథమెటిక్స్- 324
ఫిజిక్స్- 205
కెమిస్ట్రీ- 207
బాటనీ- 204
జువాలజీ- 199
హిస్టరీ- 7
ఎకనమిక్స్- 82
కామర్స్- 87
సివిక్స్- 84
ఫిజికల్ డైరెక్టర్- 34
లైబ్రెరేరియన్- 50
Telangana-JL-Jobs నోటిఫికేషన్
డిగ్రీ లెక్చరర్ ఖాళీలు: 868
తెలుగు- 55
ఇంగ్లీష్- 69
మ్యాథమెటిక్స్- 62
స్టాటిస్టిక్- 58
ఫిజిక్స్- 46
కెమిస్ట్రీ- 69
బాటనీ- 38
జువాలజీ- 58
కంప్యూటర్ సైన్స్- 99
జియాలజీ- 6
బయోకెమిస్ట్రీ- 3
బయో టెక్నాలజీ- 2
హిస్టరీ- 28
ఎకనమిక్స్- 25
పొలిటికల్ సైన్స్- 27
కామర్స్- 93
జర్నలిజం- 2
సైకాలజీ- 6
మైక్రో బయాలజీ- 17
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- 9
సోషియాలజీ- 7
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14
ఫిజికల్ డైరెక్టర్- 39
లైబ్రేరియన్- 36
Telangana-DL-Jobs నోటిఫికేషన్
ముఖ్య సమాచారం:
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 17, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: మే 17, 2023
COMMENTS