PPF: 10 profits with one scheme.. Get Rs.16 lakhs at once!
PPF: ఒక్క స్కీమ్‌తో 10 లాభాలు.. ఒకేసారి రూ.16 లక్షలు పొందండిలా!
అయితే మీకు శుభవార్త. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకునే వారికి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అదే సేఫ్ రిటర్న్స్ పొందాలని భావిస్తే.. పోస్టాఫీస్, బ్యాంక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు.
ప్రతి నెలా డబ్బులు పొదుపు చేస్తూ అధిక బెనిఫిట్స్ పొందాలని భావిస్తే.. ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ పథకంలో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు పెట్టడం వల్ల పది రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. చాలా బ్యాంకులు అందించే ఎఫ్డీ రేట్ల కన్నా ఇది ఎక్కువనే చెప్పుకోవాలి.
పీపీఎఫ్ స్కీమ్ ఈఈఈ కేటగిరి కిందకు వస్తుంది. అంటే మూడు రకాల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ట్యాక్స్ మినహాయింపు ఉంది.
దీనిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ పడదు. మెచ్యూరిటీ సమయంలో విత్‌డ్రా చేసుకునే మొత్తంపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. అందుకే దీన్ని బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఒకటిగా చెప్పుకుంటారు.
రిస్క్ అనేది ఉండదు. కచ్చితమైన రాబడి పొందొచ్చు. అయితే ఇది వడ్డీ రేటు మార్పు అంశంపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు పెరిగితే ఎక్కువ రాబడి వస్తుంది. తగ్గితే తక్కువ రాబడి రావొచ్చు.
ఈ స్కీమ్‌లో చేరడం కూడా చాలా సులభం. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి చేరొచ్చు. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి కూడా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఆన్లైన్లోనే డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆటోడెబిట్ యాక్టివేట్ చేసుకోవచ్చు
పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. అకౌంట్ తెరిచిన మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్యలో లోన్ ఫెసిలిటీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని తిరిగి కట్టేయాలి.
తక్కువ మొత్తంతో కూడా ఈ అకౌంట్ తెరవొచ్చు. ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశం. రూ.500 ఖాతా తెరవొచ్చు. ఏడాదిలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అయితే ఈ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్‌ను పెంచుకుంటూ వెళ్లొచ్చు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి.
నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేసుకుంటే వెలితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 16 లక్షలకు పైగా పొందొచ్చు. ఈ మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మీరు నెలవారీ డిపాజిట్ అమౌంట్ పెంచుకుంటే మెచ్యూరిటీ మొత్తం మరింత పెరుగుతుంది.
COMMENTS