NISAU Scholarship: Good news for Indian students studying in UK.. Huge scholarship offer..
NISAU Scholarship: యూకేలో చదివే ఇండియన్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ స్కాలర్‌షిప్స్ ఆఫర్..
యూకేలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ కోసం.. నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (NISAU) స్కాలర్‌షిప్స్ ప్రకటించింది.
Scholarship: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవడం(Study abroad) చాలా మంది విద్యార్థుల కల. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారి కోసం చాలా సంస్థలు స్కాలర్‌షిప్స్(Scholarships) అందిస్తూ ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నాయి. తాజాగా యూకేలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ కోసం.. నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (NISAU) స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ఇందుకు ETS (Educational Testing Service) TOEFLతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు సంయుక్తంగా ‘UK-ఇండియా టోఫెల్ స్కాలర్‌షిప్’ పేరుతో 25 మంది భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనున్నాయి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను చదవాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం toefltest.in/scholarship వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇందుకు చివరి తేదీ జులై 31గా నిర్ణయించారు. మొత్తం స్కాలర్‌షిష్స్ విలువ రూ.64 లక్షలు కాగా, ఎంపికైన ప్రతి అభ్యర్థి రూ.2.4 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌ను అందుకుంటారు.
ఈ స్కాలర్‌షిప్‌లో ట్యూషన్ ఫీజు, హౌసింగ్ డిపాజిట్లు, ట్రాన్స్‌ఫోర్టేషన్, పుస్తకాల ఖర్చులు వంటివి కలిసి ఉంటాయి. స్కాలర్‌షిప్ విజేతలను NISAU, UK యూనివర్సిటీ ప్రతినిధులతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేస్తుంది.
అర్హత ప్రమాణాలు
అభ్యర్థుల ఎంపిక కోసం టోఫెల్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు 120 మార్కులకు 75 స్కోర్ చేయాల్సి ఉంటుంది. యూకే యూనివర్సిటీల్లో ఫస్ట్ టైమ్ చదువుతూ ఉండాలి. యూకే యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చి ఉండాలి. యూజీ లేదా పీజీ కోర్సులకు ఫీజు చెల్లిస్తుండాలి. స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయడానికి, విద్యార్థులు తమ TOEFL పరీక్ష స్కోర్‌కార్డ్‌తో పాటు UK బేస్డ్ ఎడ్యుకేషన్‌తో సోషల్ ఇంపాక్ట్ అనే అంశంపై 500 పదాల వ్యాసాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
అప్లికెంట్స్ అర్హత, సపోర్టింగ్ డాక్యుమెంటేషన్, వ్యాసం, ఇతర వ్యక్తిగత, విద్యాపరమైన ఆధారాలను పరిశీలించి గరిష్టంగా 25 మందిని ఎంపిక చేస్తారు. వారికి ETS ఇండియా నుంచి సమాచారం అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ ఖాతాలకు ఒకేసారి 3,000 డాలర్లు పేమెంట్ చేస్తారు. ETS ఇండియా సంతకంతో కూడిన ఆఫర్ కాపీ అందిన తర్వాత 60 రోజులలోపు ఫుల్ గ్రాంట్ మొత్తం అభ్యర్థుల అకౌంట్లలో జమ కానుంది.
TOEFL పరీక్షలో మార్పులు
ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS), TOEFL పరీక్షలో కొన్ని మార్పులు చేసింది. TOEFL iBT పరీక్ష ఇప్పుడు మూడు గంటలకు బదులుగా రెండు గంటలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పరీక్షలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండే ‘రైటింగ్ ఫర్ యాన్ అకడమిక్ డిస్కషన్’ అనే టాస్క్ కూడా ఉంటుంది. దీన్ని స్వతహాగా రాయాల్సి ఉంటుంది.
COMMENTS