Indian Railways : Indian Railway Alert ! Train travel rules have changed. These are the new rules.
Indian Railways : ఇండియన్ రైల్వే అలర్ట్ ! రైలు ప్రయాణం రూల్స్ మారినాయి .ఇవీ కొత్త నిబంధనలు .
భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు రైళ్లలో ప్రయాణించే నిబంధనలను మారుస్తూ వస్తోంది. రైల్వేలు మార్చుతున్న నిబంధనల గురించి మీకు పూర్తి సమాచారం తెలిసి ఉండటం తప్పనిసరి.
ప్రయాణికుల సౌకర్యార్థం, వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి రైల్వేశాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది. భారతదేశం అంతటా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ఏర్పాటు చేసింది. సరైన ప్రజా ప్రవర్తనను నిర్వహించడానికి రాత్రి సమయాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను సూచించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. రైలు అటెండర్లు, టీటీఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర రైల్వే ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ధూమపానం, మద్యం సేవించడం లేదా ఏదైనా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు IRCTC నుండి తీవ్రమైన జరిమానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
IRCTC కొత్త నియమాలు..
ప్రయాణీకులు తమ సీట్లు, కంపార్ట్‌మెంట్లు లేదా కోచ్‌లలో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు లేదా తోటి ప్రయాణీకులతో మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు చేయకుండా ఉండాలి.
ప్రయాణికులు హెడ్‌ఫోన్స్ లేకుండా బిగ్గరగా మ్యూజిక్ వినకూడదు.
ప్రయాణికులెవరూ రాత్రి 10 గంటలకు మించి లైట్లు వేయకూడదు.
IRCTC ప్రకారం రాత్రి 10 తర్వాత..
TTE రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణీకుల టిక్కెట్లను చూపించమని అడగకూడదు..
సమూహంగా ప్రయాణిస్తే రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు పెద్దగా మాట్లాడకూడదు.
మిడిల్ బెర్త్ ప్రయాణికులు ఎప్పుడైనా తమ సీట్లు తెరవవచ్చు, లోయర్ బెర్త్ ప్రయాణికులు వారిపట్ల ఎలాంటి ఫిర్యాదు చేయరాదు.
ఆన్‌లైన్ డైనింగ్ సేవలు రాత్రి 10 గంటల తర్వాత ఆహారం సప్లై చేయవు. అయితే, ఇ-కేటరింగ్ సేవలు మీ భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
IRCTC బ్యాగేజీ నియమాలు
ఏసీ కోచ్‌లో ఒక్కో ప్రయాణికుడు 70 కిలోల వరకు సరుకులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు బ్యాగేజీ ఉచితం. అదనపు బ్యాగేజీ ఛార్జీలతో ప్రయాణికులు 150 కిలోల లగేజీని, స్లీపర్‌లో 80 కిలోలు, రెండో సీటులో 70 కిలోలు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.
COMMENTS