Good Friday 2023: నేడు గుడ్‌ఫ్రైడే.. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా..!
Good Friday 2023: యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.
శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని సూచించాడు యేసు. ఈ రోజునే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చింది. ఇజ్రాయిల్, నజరేత్ పట్టానికి చెందిన యేసుక్రీస్తును అక్కడి ప్రజలు క్రైస్తవుల ప్రేమమూర్తిగా, లోక రక్షకుడిగా కొలుస్తారు. ఇది నచ్చని యూదా ప్రవక్తలు, మత పెద్దలు కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే దేవుడి ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తారు. ఎలాగైనా యేసును హతమార్చాలని చక్రవర్తిపై మరింత ఒత్తిడి చేసి సిలువ వేసే వరకు తీసుకొస్తారు. ఓ తండ్రి వీరిని క్షమించు.. వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు.. అంటూ యేసుక్రీస్తు ఏడు మాటలు మాట్లాడి ప్రాణాలు వదులుతాడు. అందుకే యేసు జ్ఞాపకంగా క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేని జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్‌ఫ్రైడే. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును శిలువ వేయడాన్ని గురించి ప్రస్తావించింది. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున తెల్లవారుజామున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సావాలతో భక్తులు ఉప్పొంగి పోతారు.
COMMENTS