Foreign Education: How much money can be sent to children studying abroad? RBI Latest Update...
Foreign Education: విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎంత డబ్బు పంపవచ్చు..? ఆర్బీఐ లేటెస్ట్ అప్‌డేట్...
Foreign Education: ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్(Indian students) సంఖ్య పెరుగుతోంది.
అయితే ఇతర దేశాల్లో చదువుకుంటున్న పిల్లల అవసరాలకు ఇండియా నుంచి తల్లిదండ్రులు డబ్బు పంపాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం ఈ ట్రాన్సాక్షన్‌లకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, దేశంలో విదేశీ మారక నిల్వలు (ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్స్) చాలా తక్కువగా ఉండేవి. దీంతో ప్రపంచ దేశాలతో పోటీపడటం ఇండియాకు కష్టమైంది. కానీ సరళీకరణ(లిబరలైజేషన్) తర్వాత, భారతదేశం స్థానం మెరుగుపడింది. దేశ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ ఫ్లో అవసరమైంది. ఈ క్రమంలో 2004లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇండియాలో నివసించే వారు, ఇతర దేశాలకు డబ్బును పంపవచ్చు.
ట్రాన్సాక్షన్‌కు అనుమతి ఉంటే, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా RBI అనుమతి లేకుండా సంవత్సరానికి 250,000 డాలర్లు(దాదాపు రూ.1.8 కోట్లు) వరకు ఇతర దేశాలకు పంపవచ్చు. ఉదాహరణకు ఎడ్యుకేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్, రిలేటివ్ మెయింటెనెన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఎమిగ్రేషన్, ఫారిన్ ఎంప్లాయ్‌మెంట్ వంటి అవసరాలకు ట్రాన్సాక్షన్లను అనుమతిస్తారు. లాటరీ టిక్కెట్‌లు, విదేశీ కరెన్సీ బాండ్‌లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ వంటి వాటికి ట్రాన్సాక్షన్లను అనుమతించరు.
భారీగా పెరిగిన మనీ ట్రాన్స్‌ఫర్లు
ప్రస్తుతం ఎక్కువ మంది భారత విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే వీరి సంఖ్య 2022లో 68% పెరిగింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్(LRS) ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాల సహా విదేశాలకు డబ్బు పంపవచ్చు. RBI నివేదిక ప్రకారం.. తల్లిదండ్రులు విదేశాల్లోని పిల్లలకు మొత్తంగా 2019-20లో దాదాపు రూ.50 కోట్లు పంపారు. అదే 2020-21లో దాదాపు రూ.29 కోట్లు(కరోనా సమయం), 2021-22లో రూ.384 కోట్లు పంపారు. అయితే ఈ మొత్తం 2011-12లో కేవలం రూ.85 లక్షలుగా ఉండేది.
ఎంత వరకు పంపవచ్చు?
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం.. అన్ని ట్రాన్సాక్షన్‌లకు కలిపి రూ.1.8 కోట్ల వరకు డబ్బు పంపవచ్చు. అయితే రెసిడెంట్స్ అవసరమైతే అవసరమైన డాక్యుమెంట్‌లు అందజేసి, యూనివర్సిటీ ఫీజు కోసం మరింత విత్‌డ్రా చేసుకోవచ్చు. LRS ద్వారా తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం విదేశీ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల నుంచి సేవింగ్స్‌ను కాపాడుతుంది.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా విదేశాల్లో పెట్టుబడులు పెట్టే భారతీయుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరుగుతోంది. 2020-21లో రూ.35.3 కోట్ల నుంచి 2021-22లో ఈక్విటీలు, డెట్‌లలో పెట్టుబడి రూ.55.3 కోట్లకు పెరిగిందని RBI డేటా సూచిస్తోంది. అయితే భారతీయులు 2014-15లో రూ.14.43 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. ఇతర దేశాలకు డబ్బు పంపడానికి PAN అవసరం. RBI అనుమతి లేకుండా రూ.1.8 కోట్లు పంపవచ్చు. RBI ముందస్తు అనుమతితో అదనపు చెల్లింపులు చేయవచ్చు.
ట్యాక్స్ ఎంత చెల్లించాలి?
యూనియన్ బడ్జెట్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఫారిన్ రెమిటెన్స్‌పై ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(TCS)ని పెంచింది. కొత్త మార్పులు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి. ప్రతిపాదిత మార్పుల ప్రకారం.. ఎడ్యుకేషన్ లేదా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ రూ.7 లక్షల కంటే తక్కువగా ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లింపు మొత్తం రూ.7 లక్షలు దాటితే, లిమిట్‌ను మించిన మొత్తంపై 5% ట్యాక్స్ విధిస్తారు.
ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పంపే మొత్తం రూ.7 లక్షలకు మించితే 0.5% TCSని చెల్లించాలి. ఎడ్యుకేషన్, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులు పంపడానికి తల్లిదండ్రులు LRS ప్రయోజనాన్ని పొందవచ్చు. డాలర్లలో ఆదా చేయడానికి, కరెన్సీ వ్యాల్యూ పడిపోయే ప్రమాదాలను నివారించడానికి US మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
COMMENTS