DPS DAE Recruitment 2023: Jobs in Department of Atomic Energy with a salary of Rs.81,100 per month.
DPS DAE Recruitment 2023: నెలకు రూ.రూ.81,100ల జీతంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో..65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతతున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల తేదీలు జూన్ రెండో వారంలో ఉంటాయి.
ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
COMMENTS