APPSC Polytechnic Lecturer Jobs: Notification for Lecturer Posts in AP Polytechnic Colleges..
APPSC Polytechnic Lecturer Jobs: ఏపీ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్..
ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో.. 21 ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆటో మొబైల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టిస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ తదితర సబ్జెక్టుల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, పీజీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
అర్హులైన దివ్యాంగ అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు మే 17, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రూ.250లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు..
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టుల సంఖ్య: 1
కెమికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 4
ఇంగ్లిష్ పోస్టుల సంఖ్య: 3
మ్యాథ్స్ పోస్టుల సంఖ్య: 1
మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR MORE INFORMATION CLICKHERE
COMMENTS