AIIMS Recruitment 2023
ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా ఎంపిక చేస్తారు..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎయిమ్స్ సంస్థల్లో.. 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)- 4 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు మే 5, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల సవరణకు మే 6 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.3000లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2,400లు ఫీజు చెల్లించాలి.
నార్‌సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష జూన్ 3న ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,300ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు రూ.4,600లు గ్రేడ్ పే కూడా అందుతుంది.
ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
ఎయిమ్స్ భటిండా పోస్టులు: 142
ఎయిమ్స్ భోపాల్ పోస్టులు: 51
ఎయిమ్స్ భువనేశ్వర్ పోస్టులు:169
ఎయిమ్స్ బీబీనగర్ పోస్టులు: 150
ఎయిమ్స్ బిలాస్‌పూర్ పోస్టులు: 178
ఎయిమ్స్ దేవ్‌ఘర్ పోస్టులు: 100
ఎయిమ్స్ గోరఖ్‌పూర్ పోస్టులు: 121
ఎయిమ్స్ జోధ్‌పూర్ పోస్టులు: 300
ఎయిమ్స్ కల్యాణి పోస్టులు: 24
ఎయిమ్స్ మంగళగిరి పోస్టులు: 117
ఎయిమ్స్ నాగ్‌పుర్ పోస్టులు: 87
ఎయిమ్స్ రాయ్ బరేలీ పోస్టులు: 77
ఎయిమ్స్ న్యూఢిల్లీ పోస్టులు: 620
ఎయిమ్స్ పట్నా పోస్టులు: 200
ఎయిమ్స్ రాయ్‌పూర్ పోస్టులు: 150
ఎయిమ్స్ రాజ్‌కోట్ పోస్టులు: 100
ఎయిమ్స్ రిషికేశ్ పోస్టులు: 289
ఎయిమ్స్ విజయ్‌పూర్ పోస్టులు: 180
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
COMMENTS