Amnesia: Amnesia is high? Then do this
Amnesia : మతిమరుపు బాగా ఉందా? అయితే ఇలా చేయండి
Amnesia : మనకు వృద్ధాప్యంలో చాలా సమస్యలు వస్తుంటాయి. చర్మం ముడతలు పడుతుంది. జబ్బులు వెంటాడుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల పలు రోగాలు వేధిస్తుంటాయి. వయసు పైబడిన వారిలో ప్రధానంగా మూడు సమస్యలు నష్టం కలిగిస్తుంటాయి. ఇందులో ఒకటి పార్కింగ్ సన్స్, రెండోది అల్జీమర్స్, మూడోది డిమాండ్షియా సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రకాల సమస్యలు ముసలి వారిని కష్టపెడుతుంటాయి. పార్కింగ్ సన్స్ అంటే చేతులు మెడ ఒళ్లంతా వణకడం, శరీరం అదుపు తప్పడం, కంటి చూపు స్థిరంగా లేకపోవడం లాంటివి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.
అల్జీమర్స్ జబ్బు అంటే నరాల్లో అతిగా కరెండు సరఫరా కావడం, మెదడు కుంచించుకుపోవడం, కణాలన్ని మతిమరుపు లాంటి సమస్యలు వయసుతో పాటే వస్తుంటాయి. పెద్ద వయసు వచ్చాక ఇలాంటి తిప్పలు తప్పవు. ఈ సమస్యకు పెద్ద ఉసిరి మంచి మందులా పనిచేస్తుంది. ఇది వాస్త్రపరంగా నిరూపించబడింది పూర్వకాలంలో మన రుషులు చెప్పారు. ఉసిరితో ఎన్నో లాభాలున్నాయి. మనం ఉసిరిని ఆవకాయ రూపంలోనే తీసుకుంటున్నాం. కానీ ఇతర రూపాల్లో తినడం లేదు. ముక్కలుగా కోసుకుని సంవత్సరం పొడవునా తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరికాయలను ఉదయం, సాయంత్రం చప్పరిస్తూ ఉంటే మంచిది. భోజనం తరువాత ఉసిరి ముక్కలను నోట్లో వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఉసిరికాయను నానబెట్టుకుని తినడం వల్ల నోరు చాలా శుభ్రంగా మారుతుంది. నోట్లో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతోంది. ఉసిరికాయలు వాడితే మెదడుకు సంబంధించిన మూడు సమస్యలు రాకుండా ఉంటాయి. పెద్ద ఉసిరిలో క్లోరోజనిక్ ఆసిడ్, రెండోది కెఫిక్ ఎలాజిక్ ఆసిడ్ మూడు రకాల ఆసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల నిరంతరం మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మన వయసు పెరిగే కొద్దీ కణాలు ఎక్కువ పని చేయాల్సిందే. మెదడు కణాలు పనిచేసేటప్పుడు విడుదలయ్యే కెమికల్స్ హాని కలిగించేవి ప్రొటీన్ బీటా ఎమిలైడ్ అనే ప్రొటీన్ ఎక్కువగా మెదడు కణాలు చెడిపోవడానికి కారణాలుగా నిలుస్తాయి. దీంతో మెదడు సెల్స్ కుంచుంచించుకుపోతాయి. దీని వల్ల మతిమరుపు లక్షణాలు వస్తాయి. ఉసిరిలో ఉండే మూడు రకాల ఆసిడ్స్ తో మెదడు పాడు కాకుండా కాపాడుతాయి. దీంతో మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది. మెదడు కణాలు రక్షించబడతాయి.
COMMENTS