Organ Donation Rules in India
Organ Donation: అవయవ దానంలో మారిన కీలక నిబంధనలు.. వయోపరిమితి అంశంలో కీలక అప్‌డేట్ ఇదే..
సామాజిక కార్యకర్తలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అధిక జనాభా ఉన్న భారతదేశం అవయవ దానంలో మాత్రం వెనుకబడే ఉంది. మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా కొన్ని కఠిన నిబంధనల వల్ల కూడా భారత్‌లో అవయవాలను సేకరించిడం కష్టంగా మారిందని కొందరి వైద్యుల అభిప్రాయం. ఈ నేేపథ్యంలో భారత ప్రభుత్వం అవయవ దానం విషయంలో కొన్ని నిబంధనలను సవరించింది.
అవయవ దానం భారత్‌లో ప్రాచూర్యం లేని ఓ అంశం. మనం చనిపోయాక మన శరీరీ అవయవాలను బతికున్న వేరి వారికి అమర్చడానికి వీలుగా మనం బతికి ఉన్నప్పుడే సమ్మతిని తెలియజేయాలి. కొన్ని అనుకోని సందర్భాల్లో అయితే కుటుంబ సభ్యుల అనుమతితో కూడా అవయవాలను సేకరిస్తూ ఉంటారు. భారత్‌లో కొన్ని నమ్మకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అవయవ దానం చేస్తే సద్గతి ప్రాప్తించదని, ఇతర భయాలు బాగా ఉండడంతో అవయవ దానం విషయంలో బాగా వెనకబడి ఉన్నాం. సామాజిక కార్యకర్తలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అధిక జనాభా ఉన్న భారతదేశం అవయవ దానంలో మాత్రం వెనుకబడే ఉంది. మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా కొన్ని కఠిన నిబంధనల వల్ల కూడా భారత్‌లో అవయవాలను సేకరించిడం కష్టంగా మారిందని కొందరి వైద్యుల అభిప్రాయం. ఈ నేేపథ్యంలో భారత ప్రభుత్వం అవయవ దానం విషయంలో కొన్ని నిబంధనలను సవరించింది. వీటిలో ముఖ్యంగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ మూడు నిబంధనల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత్‌లో అవయవ దానం కేసులు పెరిగే అవకాశం ఉంది.
మారిన నిబంధనలు ఇవే
వయో పరిమితి తొలగింపు
రాష్ట్రాలు అనుసరించే నివాస ప్రమాణాల తొలగింపు
అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు
వయోపరిమితి
గతంలో అవయవ దానం చేయలంటే 65 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే అవయవ మార్పిడి రిజిస్ట్రర్ చేసుకునేందుకు అర్హులుగా పరిగణించే వారు కానీ ప్రస్తుతం ఆ వయో పరిమితిని కేంద్రం తొలగించింది.
నివాస ప్రమాణాల తొలగింపు
ప్రస్తుతం ఏదైనా రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మరణిస్తే ఆ రాష్ట్రానికి చెందిన వారికే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేవి. కొన్ని రాష్ట్రాలైతే వారి రాష్ట్రంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాల వారికి కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అనుమతినిచ్చేవి. కొన్ని రాష్ట్రాలు సమీప రాష్ట్రాలకు దానం చేసేవి. కొన్ని అరుదైన కేసుల్లోనే అవయాలను జాతీయం చేసేందుకు రాష్ట్రాలు అనుమతినిచ్చేవి. అయితే ప్రస్తుతం ఈ నిబంధనను కేంద్రం తొలగించింది. దీంతో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తికైనా అవసరాన్ని బట్టి అవయవాలను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చు.
COMMENTS