C DAC Recruitment 2023
C DAC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఖాళీలు.
ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్' (సీడ్యాక్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్’ (సీడ్యాక్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 570 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానలో భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ అసోసియేట్(30), ప్రాజెక్ట్ ఇంజినీర్(300), ప్రాజెక్ట్ మేనేజర్ (40) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మోహాలీ, ముంబై, పుణే, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్చర్, పుణేలోని కార్పొరేట్ ఆఫీస్, గుహవటి, శ్రీనగర్, చంఢీగఢ్ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 20ని చివరి తేదీగా నిర్వహించారు.
COMMENTS