Assam Rifles
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో.. గ్రూప్ బీ, సీ విభాగాల్లో 616 ఉద్యోగాలను టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-2023 ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 పోస్టులు, తెలంగాణలో 27 పోస్టులున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 19, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. గ్రూప్-బీ పోస్టులకు రూ.200లు, గ్రూప్-సీ రూ.100లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులకు ఫీజు చెల్లించనవసరం లేదు. మే 1 నిర్వహించే రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసి, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ట్రేడుల వివరాలు..
బ్రిడ్జి అండ్ రోడ్ (మేల్, ఫిమేల్)
రెలీజియస్ టీచర్ (మేల్)
క్లర్క్ (మేల్, ఫిమేల్)
ఆపరేటర్ రేడియో అండ్ లైన్ (మేల్)
రేడియో మెకానిక్ (మేల్)
పర్సనల్ అసిస్టెంట్ (మేల్, ఫిమేల్)
ల్యాబొరేటరీ అసిస్టెంట్ (మేల్)
నర్సింగ్ అసిస్టెంట్ (మేల్)
వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ (మేల్)
ఫార్మసిస్ట్ (మేల్, ఫిమేల్)
వాషర్‌మ్యాన్(మేల్)
ఫిమేల్ సఫాయి (ఫిమేల్)
బార్బర్(మేల్)
కుక్(మేల్)
మేల్ సఫాయి(మేల్)
ప్లంబర్(మేల్)
ఎలక్ట్రీషియన్(మేల్)
ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్(మేల్)
లైన్‌మ్యాన్ ఫీల్డ్(మేల్)
ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్(మేల్)
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మేల్, ఫిమేల్)
COMMENTS