WHY SOME SKINS ARE BLACK?
కొంతమంది చర్మము నల్లగా ఉంటుందెందుకు?
మన శరీరములో చర్మము , వెంట్రుకలు మొదలైన వాటిలో ఒక నల్లటి " వర్ణకము " ఉంటుంది . దీనిని " మెలనిన్" అంటాము . సూర్యరశ్మి తగలడము వలన ' మెలనోసైట్స్ 'నుండి ఈ మెలనిన్ తయారవుతుంది . మన శరీరము సూర్యరశ్మికి , అతినీలలోహిత కిరణాలకు ఎక్ష్పోజ్ అయినపుడు మెలనోసైట్స్ ఎక్కువగా మెలనిన్ ని ఉత్పత్తి చేస్తాయి . ఫలితముగా చర్మాన్ని ఎండనుండి కాపాడుతుంది . ఉష్ణ దేశములో మనిషి నిరంతరమూ ఎండనుండి కాపాడేందుకు మెలనిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కావున ఇక్కడి ప్రజలు నల్లగాఉంటారు . శీతల ప్రదేశాలలో సూర్యరశ్మి తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి వారు తెల్లగా ఉంటారు . ఎండలో తిరిగినప్పుడు చర్మమము కమిలినట్టుగా ఉండటమనేది ' ట్యానింగ్ యొక్క తాత్కాలిక పరిస్థితి . ఎక్కువకాలము అనేక నెలలు , సంవత్సరాలు సూర్యరశ్మి కి ఎక్ష్పోజ్ అయితే శాశ్వితముగా ట్యానింగ్ జరిగి చర్మము నల్లబడుతుంది .
మన చర్మంలో ప్రధానంగా మూడు పొరలు (layers) ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉన్న పొరను ఎపిడెర్మిస్ (epidermis) అంటారు. ఇది చాలా పలుచగా ఉంటుంది. కంటిరెప్పలపై ఉన్న చర్మంలో దీని మందం సుమారు 0.5 మి.మీ., అరిచేతి చర్మంలో సుమారు 1.5 మి.మీ. మందంలో ఉండగా, అరికాలి చర్మం శ్రామికులకు 2 మి.మీ. వరకూ ఉంటుంది. సుఖజీవులకు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎపిడెర్మిస్ కింద ఉన్న (రెండో) పొరను డెర్మిస్ (dermis) అంటారు. ఇది సుమారు 3 మి.మీ. మందంతో ఉంటుంది. ఇందులోనే రోమాల కుదుళ్లు (hair follicles), చెమట గ్రంథులు (sweat glands), చర్మాన్ని సాగదీయడానికి, కుదించడానికి ఉపకరించే పలుచని సంధాన కండర కణజాలం (connective tissue) ఉంటాయి. డెర్మిస్‌లోనే అడుగుభాగాన నూలుపోగుల కన్నా సన్నని నాళాలతో రక్తనాళాలు(blood capillaries) ఉంటాయి. డెర్మిస్‌కన్నా కింద ఉన్న భాగాన్ని సబ్‌క్యుటేనియస్ పొర (subcutaneous layer) అంటారు. ఇందులో కొవ్వు కణాలు దండిగా ఉంటాయి. ఊబకాయం ఉన్న వాళ్లకు ఇక్కడే కొవ్వుకణాలు పేరుకుపోయి వివిధ మందాల్లో ఉంటుంది.
COMMENTS