WHAT IS COCAINE AND ITS EFFECTS?
కొకైన్ అంటే ఏమిటి ? ఎందుకు వాడుతారు?
కొలంబియా దేశపు అడవులలో కనిపించింది. స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ పరిశోధకులు అడవుల మధ్యన రహస్యంగా కోకా చెట్టును పెంచుతున్నారనడానికి ఆధారాలను గుర్తించారు. ఈ కోకా చెట్టు నుంచి కొకైన్ అనే మాదకద్రవ్యం తయారవుతుంది. కొలంబియా వర్షారణ్యాలలో ఈ రకం స్థలాలు ఎక్కువవుతున్నాయని, అందువల్ల అడవులలోని అరుదయిన వృక్ష, జంతు జాతులు, వాటి వైవిధ్యం దెబ్బతింటున్నదని పరిశోధకులు అంటున్నారు. ... కోకా పండించడమే అడవుల వినాశనానికి కారణమని తెలిసిపోయింది. 2005 కు ముందు కోకా కారణంగా అడవులు నాశనం కావడం చాలా తక్కువగా ఉండేదని, .మామూలు పొలాలలో కోకా పండించడం ఈ దేశంలో తెలిసిందే. కానీ ఆశకొద్దీ రైతులు, అక్కడికి దగ్గరలో ఉండే అడవులలోపలికి చేరి, పెద్ద ఎత్తున చెట్లను నరికి, అక్కడ కూడా పంట పండిస్తున్నారు.
తయారీవిధానము :
ఖరీదైన కొకైన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని ఎక్కువగా లాటిన్ అమెరికా దేశాల్లో తయారు చేస్తుంటారు. ప్రపంచం మొత్తానికీ అక్కడ నుంచే ఎగుమతి అవుతుందని, ఓడల ద్వారా అంచలంచెలుగా దీన్ని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. * కోకా చెట్టు ఆకుల్ని సోడియం బైకార్బొనేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చేర్చి కొకైన్‌ను తయారు చేస్తారు.
కొకైన్ లో స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే క్షారాలు (alkaloids)ఉంటాయి.. శాస్త్రీయ నామము - benzoylmethylecgonine పౌడర్ రూపములో ఉంటుంది .
లక్షణాలు :
It is
- a stimulant of the central nervous system,
- an appetite suppresent,
- Topical anaesthetic ,
- a serotonin–norepinephrine–dopamine reuptake inhibitor,
- an exogenous catecholamine transporter ligand.
ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో, ఈ క్షారాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం మత్తు పదార్ధము కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలను సడలించి సేదతీర్చడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువ పని చేయించడమే కాక, మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువవుతుంది. అలసట తగ్గుతుంది. ఏదో కొత్త ధైర్యం, సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. సెక్ష్ సామర్ధ్యము పెరిగే భావన కలుగుతుంది . అయితే ఈ నూతనోత్సాహం తాత్కాలికమే. ఎక్కువ సేపు నిలవదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువ సార్లు తీసుకుంటే ఆరోగ్యము చెడిపోవును , ఆ మందుకి బానిసై అది తీసుకోకపోతే పిచ్చెక్కినట్లు గా ప్రవర్తిస్తారు . దీని పనితనము 30 -60 నిముషాలు ఉంటుంది.
మోతాదు ఎక్కువైతే -- గాబరా గా ఉంటుంది , పేలాపన (paranoid)ఎక్కువై ఎవేవో మాటలు ఆడుతారు . చేతులు కాళ్ళు వణకడం , కొంతమందిలో ఫిట్సు లా కనిపించును . దీర్ఘకాలము వాడినవారిలో
గుండె వేగముగా కొట్టుకోవడం(Tachycardia), మెదడు లో సమతుల్యము కోల్పోవును (Brain imbalance),డిప్రెషన్ కి గురికావడం , నిద్రపట్టకపోవడము , మున్నగునవి
వాడే విధానము :
నోటి ద్వారా --- పౌడర్ ను నోటిలో వేసి చప్పరించేవారు , సిగరెట్ రూపము లో
స్మోకింగ్ చేసేవారు , కాగితం ,లేదా ఆకు లో చుట్టి కిల్లీగా నమిలేవారు .
కోకా ఆకులు -- నమిలేవారు , టీ చేసుకొని తాగేవారు ,
insufflation -- ముక్కు పొడుములా పీల్చడము ,
injection -- పౌడర్ డిస్తిల్ వాటర్ లో కలిపి సామారణముగా
హెరోయిన్ తో కలిపి ఇంజక్ట్ చేసుకుంటారు .
inhalation -- ఇన్‌హేలర్ గా వాడేవారూ ఉన్నారు .
suppository -- ఓరల్ లేదా ఏనల్ రూపము లో వాడేవారు .
డ్రగ్ మాఫీయా
గంజాయి వంటి సంప్రదాయ మాదకద్రవ్యాలకే పరిమితమైన హైదరాబాద్ ఇప్పుడు అత్యంత ఖరీదైన కొకైన్ వంటి మత్తుపదార్థాల విక్రయాలు, వినియోగానికీ కేంద్రంగా మారింది.కొకైన్ డ్రగ్ స్మగ్లింగ్ వ్యాపారం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అడపాదడపా కొకైన్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేస్తున్నా చాప కింద నీరులా ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గోవా, ముంబయి, బెంగళూరు నుంచి నగరానికి పెద్ద ఎత్తున కొకైన్ సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగర టాస్క్ఫోర్స్ దీనిపై కనే్నసి ఉంచినా స్మగ్లర్లు తమ వ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తూనే ఉన్నారు. తమ స్మగ్లింగ్‌కు సాధారణ ప్రజలను వినియోగించుకుంటూ, ఎవరికి అనుమానం రాకుండా బస్సుల్లోనే తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఎయిర్‌పోర్టు రైల్వే స్టేషన్లలో నిఘా తీవ్రం కావడంతో స్మగ్లర్లు తాజాగా బస్సు మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి రాష్ట్రంలో ప్రవేశించే ముఖ్యమైన ప్రాంతాల ద్వారా ఈ స్మగ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక నగరం చేరుకున్నాక కొకైన్ ఎక్కడికి చేరాలంటే అక్కడకు చేరుతూనే ఉంది. చివరకు జైళ్ళలో ఉన్న ఖైదీల వద్దకు కూడా చేరుతున్నాయంటే ఏ స్థాయిలోముఠాలు పని చేస్తున్నాయో వెల్లడవుతోంది.
ధర ఎంత ఉంటుంది ?
గ్రాము కొకైన్‌ను విదేశాల నుంచి రూ.600 నుంచి వెయ్యి రూపాయలై వరకు కొనుగోలు చేసి నగరానికి చేరిన తర్వాత దాని ధర రెండు మూడు ఇంతలు పెంచి విక్రయిస్తున్నారు. గ్రాము కొకైన్ ధర రూ.2500 నుంచి అవసరాన్ని బట్టి రూ.5 వేల వరకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు నిఘా ఉన్నా తమ నెట్‌వర్క్ ద్వారా చాలా సులభంగా బస్సుల్లో రవాణా చేస్తూ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయంలో నగర ప్రజల సహాయ సహకారాలు ఉంటే తప్ప పూర్తిగా మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించలేమని పోలీసులు
చెబుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలతో కూడిన సుమారు 60 మందికి డ్రగ్స్ వ్యాపారంతో లింకులు ఉన్నట్లు చాలా వరకు సమాచారం లభించినా ఖచ్చితమైన ఆధారాలు లేక పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. దీంతో జాగ్రత్తపడిన ఆయా పెద్దలు చట్టానికి దొరక్కుండా మరీ ఈ వ్యాపారం చేస్తున్నారు.
COMMENTS