WAPCOS RECRUITMENT 2023
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 161 ఉద్యోగాలు.. నెలకు రూ.65,000ల జీతంతో కేంద్రకొలువులు
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన గురుగావ్‌లోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్‌కోస్ లిమిటెడ్).. 161 టీమ్ లీడర్/ఎక్స్‌పర్ట్, క్వాంటిటీ సర్వేయర్ తదితక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా కింది ఈ మెయిల్ ఐడీకి ఫిబ్రవరి 2, 2023వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
టీమ్ లీడర్/ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 2
క్వాంటిటీ సర్వేయర్ పోస్టులు: 2
స్ట్రక్చరల్ ఇంజినీర్ పోస్టులు: 4
ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-I పోస్టులు: 2
హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 2
రెసిడెంట్ ఇంజినీర్, సీనియర్ నీటి సరఫరా ఇంజినీర్ పోస్టులు: 7
సీనియర్ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్ పోస్టులు: 10
మెటీరియల్ ఇంజినీర్ పోస్టులు: 7
నీటి సరఫరా, CADD ఇంజినీర్ పోస్టులు: 15
క్వాంటిటీ సర్వేయర్-II పోస్టులు: 15
కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్ పోస్టులు: 30
సర్వే ఇంజినీర్ పోస్టులు: 15
ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-II పోస్టులు: 15
సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 18
సైట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 2
అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు: 5
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: 5
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 5
ఈమెయిల్ ఐడీ:
hrwapcosbbsr@gmail.com
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS