UPI INTERNATIONAL 2023
యూపీఐ ద్వారా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ.. సేవలను ఇలా ఉపయోగించుకోండి..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) దేశీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే అంతర్జాతీయంగా కూడా నగదు బదిలీ కోసం యూపీఐ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా క్యాష్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ చాలా సులువుగా మారిపోయాయి. గతంలో ఎవరికైనా డబ్బు పంపించాలంటే చాలా సమస్యగా ఉండేది. బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా మొబైల్ ద్వారానే, ఎక్కడైనా చాలా సులభంగా ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. దీనికి కారణం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సర్వీస్. బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్‌తో లింక్ అయ్యి ఉంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ సర్వీసుల ద్వారా బిల్లుల పేమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) దేశీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే అంతర్జాతీయంగా కూడా నగదు బదిలీ కోసం యూపీఐ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
యూపీఐ పేమెంట్స్
అయితే అంతర్జాతీయ చెల్లింపులు, నగదు బదిలీకి కూడా ఈ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2020లో ఎన్‌పీసీఐ విదేశాలలో యూపీఐ సేవల కోసం ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమెటెడ్‌ను స్థాపించి సేవలను ప్రారంభించింది. యూపీఐ అంతర్జాతీయ చెల్లింపుల సేవల ద్వారా సులభంగా విదేశాల నుంచి భారత్‌లో ఉన్న వారికి డబ్బు పంపిచవచ్చు. ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం ఇలాంటి సేవల ద్వారా అత్యధికంగా నగదును స్వీకరిస్తున్న దేశంగా భారత్ ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ సేవలను వినియోగించుకుని తమ వారికి నగదు పంపుతున్నారు.
రెండు యూపీఐ ప్లాట్‌ఫామ్స్
భారత్‌కు అంతర్జాతీయ చెల్లింపుల కోసం వైస్, వెస్ట్రన్ యూనియన్ అనే రెండు ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. యూపీఐ బదిలీలు ఒక్కోసారి ఇతర నగదు బదిలీలతో పోలిస్తే సురక్షితంగా, చౌకగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాల్సిన అవసరం లేకుండా కేవలం కేవలం యూపీఐ ఐడీ ఇస్తే సరిపోతుంది. నగదు బదిలీల కోసం వినియోగదారులు వైస్ లేదా వెస్ట్రన్ లో యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా పంపాలి?
యూపీఐ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ను సులభతరం చేయడానికి భారత్ వెస్ట్రన్ యూనియన్ అనే ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరికైతే డబ్బు పంపిచాలనుకుంటున్నామో వారి యూపీఐ ఐడీ తెలిస్తే సరిపోతుంది. దాని ద్వారా విదేశాల్లో ఉన్న వారు భారత్‌లోని వారికి సులువుగా డబ్బు పంపొచ్చు. గతంలో లాగా గంటల పాటు నిరీక్షణ అవసరం లేదు. వెస్ట్రన్ యూనియన్ అకౌంట్‌లోకి వెళ్లి రిసీవర్స్ కంట్రీ ఆప్షన్‌లో ఇండియా సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ఐడీని సెలక్ట్ చేసుకోవాలి. ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించే చేసే నగదు చెల్లింపులకు వెస్ట్రన్ యూనియన్ కొంత ఛార్జ్ చేస్తుంది.
COMMENTS