TELL THE PARTS IN RAMAYANA?
రామాయణము లో కాండములు తెలపండి?
రామాయణము, మహాభారతము, భాగవతము మొదలైన సాంస్కృతిక సంపదలు మనకు మన పూర్వీకులైన మహుఋషుల నుండి లభించాయి. ‘‘రామాయణం’’ ఒక మహా కావ్యం. దీనిని ఆది కవి అయిన శ్రీ వాల్మీకి రచించారు. ఈ కావ్యం ద్వారా మనం మన కుటుంబీకులైన తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు వంటి వారితో ఆదర్శంగా ఎలా వుండాలోనన్నది క్లుప్తంగా విశ్లేషించడమైనది. ‘‘రామాయణం’’ అంటే ‘‘రామ’’, ‘‘అయనము’’ అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము. అంటే.. రాముడు అనుసరించిన మార్గము అని అర్థం. ఈ రామాయణంలో రాముడు తన ధర్మాన్ని అనుసరిస్తూ.. తాను నడిచిన ధర్మ మార్గాన్ని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనము.
రామాయణంలో మొత్తం 24వేల శ్లోకాలు వున్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడి వున్నాయి. రామాయణంలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో (అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలుంటాయి) రాయబడ్డాయి.
రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. మొత్తము 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.
1.బాల కాండము (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
2.అయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
3.అరణ్య కాండము (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
4.కిష్కింధ కాండము (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
5. సుందర కాండము (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
6.యుధ్ధ కాండము (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
7.ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
రామాయణం మొత్తం ఒక కథలా నడుస్తుంది. ఇందులో వున్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలైన పాత్రలు మన సంస్కృతీకి ప్రతీకలు. రామాయణం హిందూ మతంలోనే కాదు... బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో వుంది. మన దేశంలోనే కాక ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా వంటి మొదలైన దేశాలలో కూడా అమలులో వుంది. రామాయణం కూడా మహాభారతంలాగే అనేక దశలలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందింది. క్రీ.పూ.4, 5 శతాబ్దాలకు చెందిన రామాయణం ప్రస్తుత రూపంలోకి వచ్చింది.
COMMENTS