STAFF NURSE NOTIFICATION 2023
5,204 పోస్టులతో స్టాఫ్ నర్సుల నోటిఫికేషన్.. ఆ అభ్యర్థులకి వెయిటేజీ..
Staff Nurse Notification :తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. న్యూ ఇయర్ వేళ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా.... డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను.... వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ఇవే..
డీఎంఈ, డీహెచ్ – 3,823
వైద్య విధాన పరిషత్ – 757
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ – 81
డిజేబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ – 13
మొత్తం 100 మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కార్యక్రమాలు, ప్రభుత్వ వైద్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నర్సులకి 20 మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు. పోస్టుల కోసం దరఖాస్తు చేసే ప్రతి అభ్యర్థి రూ. 500 పరీక్ష ఫీజు కింద చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు రూ. 120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. పోస్టుల కోసం దరఖాస్తు చేసేందుకు గరిష్ఠ వయసు 44 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని.... మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోందని.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా మొత్తం 7,320 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని... ఇందులో ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల ఎంపికపూర్తయిందని వెల్లడించారు. తాజాగా స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ ట్వీట్ చేశారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS