SBI Jobs 2023: Good news for candidates looking for bank jobs..
SBI Jobs 2023: బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ ఎప్పుడంటే..
బ్యాంకులో ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ని చూడండి.. తద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 09 ఫిబ్రవరి 2023.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (ఎస్‌సీఓ) 10 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎంబీఏ/పీజీడీఎం ఇతర నిర్దేశిత అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ప్రకారం కనీస వయస్సు 25 / 33 / 38 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 / 45 / 50 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక ఇలా జరుగుతుందంటే..
విద్యార్హత, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం 100 మార్కులు నిర్దేశించబడ్డాయి. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్‌గా ఉండటం తప్పనిసరి.
అప్లికేషన్ ఫీజు..
రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఉద్యోగం కోసం అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ని సందర్శించడం ద్వారా చివరి తేదీ కంటే ముందు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సహాయం తీసుకోవచ్చు.
FOR WEBSITE CLICKHERE
COMMENTS