SBI INTEREST CERTIFICATE 2024
SBI హోమ్ లోన్ వడ్డీ రేటు సర్టిఫికెట్ ఇలా తీసుకోండి
హోమ్ లోన్ రుణగ్రహీతలు వరుసగా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 80సీ, 24 సెక్షన్ల కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్, హోమ్ లోన్ వడ్డీ రీపేమెంట్ పైన పన్ను ప్రయోజనం పొందడానికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు నుండి హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికెట్‌ను అభ్యర్థించడం అవసరమవుతుంది. మీ రుణదాత మీ హోమ్ లోన్ ఖాతా స్టేట్‌మెంట్‌ను మీకు అందిస్తారు. దీనిని హోమ్ లోన్ సర్టిఫికెట్ అంటారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ హోమ్ లోన్ పైన మీరు చెల్లించిన వడ్డీ, అసలు మొత్తం సారాంశం కలిగి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్
సాధారణంగా పర్సనల్ లోన్ కంటే హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కరోనా సమయంలో హోమ్ లోన్ వడ్డీ రేటు భారీగా తగ్గింది. ఇది రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. కాబట్టి చాలామంది హోమ్ లోన్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. పన్ను ప్రయోజనాలు పొందడానికి హోమ్ లోన్ వడ్డీ రేటు సర్టిఫికెట్‌ను ఆన్ లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో పొందినప్పటికీ లేదా వ్యక్తిగతంగా పొందడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
ఇలా డౌన్ లోడ్ చేయండి
Step 1: ఎస్బీఐ వెబ్ సైట్ https://www.onlinesbi.com/personal/ లోకి వెళ్లాలి.
Step 2: మీ నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్ ద్వారా నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్ళాలి.
Step 3: e-Services ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత My certificates పైన క్లిక్ చేయాలి.
Step 4: Home loan interest certificate కనిపిస్తుంది. దీని పైన క్లిక్ చేయాలి.
Step 5: లోన్ అకౌంట్‌లోని లోన్ పైన క్లిక్ చేయాలి.
Step 5: ఈ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్‌ను ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎస్బీఐ హోమ్ లోన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ కస్టమర్లు హోమ్ లోన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టవచ్చు. బ్రాంచీకి వెళ్లి ఆఫ్ లైన్ ద్వారా తీసుకోవచ్చు. అవసరమైన వివరాలతో దరఖాస్తును నింపి, దానిని ఇవ్వాలి.
హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80సీ కింద ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం ఉంటుంది. సెక్షన్ 24బీ కింద హోమ్ లోన్ వడ్డీ రేటు పైన ప్రయోజనం ఉంటుంది.
COMMENTS