RBI 2023
దేశంలో సురక్షితమైన బ్యాంక్స్.. లిస్ట్ విడుదల చేసిన RBI.. మీ అకౌంట్ వీటిలో ఉందా..?
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని సురక్షితమైన, అత్యంత విశ్వసనీయమైన బ్యాంకుల పేర్లను ప్రకటించింది. ఇటువంటి జాబితాను రిజర్వ్ బ్యాంక్ 2015 నుంచి ప్రచురిస్తూనే ఉంది. ఈ బ్యాంకులు అటు కస్టమర్లకు ఇటు భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. వీటికి ఏవైనా జరిగితే దాని పర్యవసానాలు దేశమంతటా ఉంటాయి. ఈ ఏడాది జాబితా ప్రకారం అసలు ఏఏ బ్యాంకులను ఆర్‌బీఐ ఎంపిక చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంపికైన బ్యాంక్స్..
ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైన బలమైన బ్యాంకింగ్ విధానం చాలా ముఖ్యం. బ్యాంకుల పనితీరు కేవలం వినియోగదారులు మాత్రమే కాక ప్రభుత్వాలు కూడా గమనిస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా.. దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకుల-2022 జాబితాను RBI విడుదల చేసింది. ఇందులో మెుత్తం మూడు బ్యాంకులను ఎంపిక చేయగా రెండు ప్రైవేటు రంగానికి, ఒకటి ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు ఉన్నాయి.
మూడు బలమైన బ్యాంకులు..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ RBI విడుదల చేసిన తాజా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశీయ వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకుల ఈ జాబితాలో పతనం లేదా వైఫల్యం జరిగితే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాంటి బ్యాంకులపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్రతి ఏటా రేటింగ్..
ప్రతి సంవత్సరం ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ దేశంలోని బ్యాంకులకు రేటింగ్స్ ఇస్తుంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు కేవలం మూడు బ్యాంకులు మాత్రమే చేరాయి. ఇవి ఎట్టిపరిస్థితుల్లోనూ విఫలమవ్వడానికి వీలులేని బ్యాంకులని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి సహాయం చేస్తుంది. 2015, 2016 విడుదల చేసిన జాబితాలో RBI.. SBI, ICICI బ్యాంకులను మాత్రమే చేర్చింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తింది. ఆ తర్వాత 2017లోHDFC పేరు కూడా ఇందులో చేర్చబడింది.
COMMENTS