India Post GDS Recruitment 2023: 40,889 jobs in post office with tenth qualification.. How many vacancies are there in Telugu states..
India Post GDS Recruitment 2023: టెన్త్ అర్హతతో పోస్టాఫీసులో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న.. 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 2,480 పోస్టులుండగా తెలంగాణలో 1266 వరకు ఖాళీలు ఉన్నాయి. రోజుకు కేవలం 4 గంటల పని మాత్రమే ఉంటుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు అదనంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు.
ఈ విధమైన విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/కంప్యూటర్/స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది.
ఏయే అర్హతలు ఉండాలంటే..
మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైతే చాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 16, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి.
జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్ జండర్, మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు.
పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సెలక్ట్ అయిన వారికి ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు.
జీతభత్యాలు ఎలా ఉంటాయంటే.. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000ల నుంచి రూ.29,380ల వరకు, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు: 2480
అసోం ఖాళీలు: 407
బీహార్ ఖాళీలు: 1461
ఛత్తీస్గఢ్ ఖాళీలు: 1593
ఢిల్లీ ఖాళీలు: 46
గుజరాత్ ఖాళీలు: 2017
హరియాణా ఖాళీలు: 354
హిమాచల్ ప్రదేశ్ ఖాళీలు: 603
జమ్ము & కశ్మీర్ ఖాళీలు: 300
ఝార్ఖండ్ ఖాళీలు: 1590
కర్ణాటక ఖాళీలు: 3036
కేరళ ఖాళీలు: 2462
మధ్యప్రదేశ్ ఖాళీలు: 1841
మహారాష్ట్ర ఖాళీలు: 2508
నార్త్ ఈస్టర్న్ ఖాళీలు: 923
ఒడిశా ఖాళీలు: 1382
పంజాబ్ ఖాళీలు: 766
రాజస్థాన్ ఖాళీలు: 1684
తమిళనాడు ఖాళీలు: 3167
తెలంగాణ ఖాళీలు: 1266
ఉత్తర ప్రదేశ్ ఖాళీలు: 7987
ఉత్తరాఖండ్ ఖాళీలు: 889
పశ్చిమ్ బెంగాల్ ఖాళీలు: 2127
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR REGISTRATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS