PAN CARD LOST 2023
పాన్ కార్డు పోగొట్టుకున్నారా? మొదట ఇలా చేయండి, ఈ-పాన్ ఇలా పొందండి
అన్ని విధాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డు లేదా పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) ముఖ్యమైనది. ఇది 10 అంకెల అల్పాన్యూమరిక్ పాన్ నెంబర్. పాన్ నెంబర్ లేకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయలేరు. ఆదాయపు పన్ను రిటర్న్స్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం వంటి ఇలా ఎన్నింటికో పాన్ కార్డు అవసరం. ఇలాంటి పాన్ కార్డును పోగొట్టుకుంటే ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డు వచ్చే వరకు ఇబ్బందులు లేకుండా ఆదాయపు పన్ను శాఖ ఈ-పాన్ డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్
- ఈ పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇదీ...
- మొదట ఈ కింది లింక్ లోకి వెళ్లాలి.
https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
- డౌన్ లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- పాన్ నెంబర్‌తో పాటు ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.
- టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేసి, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.
- ఒకసారి మీరు కన్ఫర్మ్ చేశారంటే, ఆ తర్వాత అక్కడ కనిపిస్తుంది. ఆ ఈ-పాన్‌ను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆ మొత్తం చెల్లించి...
- మీరు రూ.8.26 పైసలు పేటీఎం లేదా యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా పే చేయాలి.
- ఒకసారి మీరు అమౌంట్ పే చేస్తే, మీరు ఆ తర్వాత ఈ-పాన్ కార్డును డౌన్ లోడు చేసుకోవచ్చు.
- ఒకసారి పేమెంట్ చేశాక, ఈ-పాన్ కార్డు పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి పాస్ వర్డ్ అవసరం. ఈ పాస్ వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది.
మరో విషయం గుర్తుంచుకోండి..
మీరు మీ పాన్ కార్డును పోగొట్టుకుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అలాగే, మీ పాన్ కార్డు ద్వారా ఏదైనా బినామీ ట్రాన్సాక్షన్ జరిగిందా అనే విషయాన్ని ఫామ్ 26ఏఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.
COMMENTS