New policy for employees..1 lakh fine if you disturb an employee who is on leave
ఉద్యోగుల కోసం కొత్త పాలసీ..లీవ్ లో ఉన్న ఉద్యోగిని డిస్ట్రర్బ్ చేస్తే రూ.1లక్ష జరిమానా
New policy to dream 11 employees : సాధారణంగా మనం ఒక ఆఫీసులో(Office) పనిచేస్తున్నప్పుడు సెలవు రోజుల్లో లేదా వీకాఫ్ రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆఫీస్ నుంచి కాల్స్ రావడం సహజం. చాలామంది ఉద్యోగులకు ఇలా సెలవు రోజుల్లో ఆఫీస్ నుంచి ఆ పి చెయ్యి ఈ పని చెయ్యాలి అంటూ కాల్స్ రావడం మనకు తెలిసిందే. అయితే ఒక కంపెనీ తమ ఉద్యోగులకు తమ సెలవు దినాలలో ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కీలక చర్యలు తీసుకుంది. ఉద్యోగికి కాల్ వస్తే జరిమానా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంది. డ్రీమ్11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్... తమ ఉద్యోగులందరికీ వారి సెలవు దినాలలో విశ్రాంతి, రివైండ్, పునరుజ్జీవనం కల్పించడంలో సహాయపడటానికి "డ్రీమ్11 అన్‌ప్లగ్(Dream 11 Unplug)"పాలసీ ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఉద్యోగికి సెలవు రోజుల్లో ఈమెయిల్‌లు, చాట్‌లు, ఇతర గ్రూప్స్ తో ఎలాంటి పరిచయం ఉండకూడదు.
డ్రీమ్ 11 కంపెనీ సహ వ్యవస్థాపకులు హర్ష్ జైన్, భవిత్ సేథ్ మాట్లాడుతూ..."సంవత్సరానికి ఒకసారి, ఒక వారం పాటు, ఉద్యోగులు [కంపెనీ] సిస్టమ్ నుండి తొలగించబడతారు. అప్పుడు వారికి స్లాక్, ఈమెయిల్‌లు, కాల్‌లు ఉండవు. అన్‌ప్లగ్ లేదా ఓ ఉద్యోగి సెలవు సమయంలో ఉన్న ఆఫీసు నుంచి మరొక ఉద్యోగి అతడిని సంప్రదిస్తే ఆ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరైనా దాదాపు సుమారు 1 లక్ష జరిమానా చెల్లించాలి"అని తెలిపారు.
డ్రీమ్ 11 కంపెనీ గత ఏడాది ఫిబ్రవరిలో లింక్డ్‌ఇన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో..."డ్రీమ్11లో సాధ్యమయ్యే ప్రతి స్టేడియం కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి మేము 'డ్రీమ్‌స్టర్'ని లాగ్ ఆఫ్ చేస్తాము. అది స్లాక్ అయినా, ఈమెయిల్‌లు, వాట్సాప్ అయినా. డ్రీమ్‌స్టర్ యొక్క వర్క్ ఎకోసిస్టమ్‌లోని ఎవరూ కూడా.. విరామంలో ఉన్న సమయంలో ఉద్యోగిని సంప్రదించకుండా ఉంచడానికి మేము దీన్ని చేస్తాము"అని తెలిపారు. Dream11లో పనిచేసే వ్యక్తి దీన్ని ఎలా ఎంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? "అన్‌ప్లగ్డ్‌ని పొందాలంటే... డ్రీమ్‌స్టర్స్ సంస్థలో కనీసం ఒక సంవత్సరం గడిపి ఉండాలి లేదా ఒక IPLపై పని చేసి ఉండాలి అని ప్రకటనలో పేర్కొన్నారు.
COMMENTS