LIC Kanyadan: At the time of daughter's marriage Rs. Chance to get 26 lakhs.. Super scheme from LIC.
LIC Kanyadan: కూతురి వివాహ సమయానికి రూ. 26 లక్షలు పొందే అవకాశం.. ఎల్‌ఐసీ నుంచి సూపర్ స్కీమ్.
పిల్లల చదువుల కోసం, వివాహం కోసం డబ్బును దాచుకోవడం సర్వసాధారణమైన విషయం. డబ్బును దాచుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఒక మంచి స్కీమ్‌ను తీసుకొచ్చింది.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా కూతురు పెళ్లి కోసం డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇంతకీ ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు.? ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ పాలసీలో భాగంగా కుమార్తె పేరుపై 22 ఏళ్లపాటు నెలవారీ రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా 25 ఏళ్ల పాటు చెల్లిస్తే తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు.
అయితే నెలవారీ ప్రీమియంను తక్కువగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఇక పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణం కూడా పొందొచ్చు.
దీంతో పాటు ప్రీమియం డిపాజిట్‌పై 80C కింద మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. పాలసీకి సమ్ అష్యూర్డ్ పరిమితి కనిష్టంగా రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది గరిష్ట పరిమితి ఉండదు.
పాలసీ కాల పరిమితి 13 నుంచి 25 ఏళ్లు ఉంటుంది.
పాలసీ తీసుకోవడానికి తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 65 సంవత్సరాలు.
ఇక కుమార్తె వయసు విషయానికొస్తే 1 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసికం, ఆఫర్ ఇయర్, ఇయర్లీగా చెల్లించవచ్చు.
ఒకవేళ పాలసీ తసుకున్న కొంత కాలానికి తండ్రి చనిపోతే కుటుంబం పాలసీని చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రీమియం మొత్తం మాఫీ అవుతుంది.
దీంతో పాలసీ ఉచితంగా అమలవుతుంది.
మెచ్యూరిటీ సమయం నాటికి మొత్తం నామినీకి అందుతుంది.
COMMENTS