HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 2023

SHARE:

HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 

ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా?

HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 2023

ఆలుమగలు ఎలాంటి అరమరికలు, అపార్థాలు లేకుండా అన్యోన్యంగా జీవించే ఇల్లు భూతల స్వర్గంగా ఉంటుంది. అయితే ఆలుమగలు ఎంత అనురాగంతో ఉన్న ఏదో ఒక సందర్భంలో కలతలు మూమూలుగానే వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లోనే భార్యాభర్తలు తెలివిగా మసలుకోవాలి, ప్రేమలు రెట్టింపు కావడానికి, మనస్పర్థలు పెరిగిపోవడానికి అవే మూలం. మనస్పర్థలు, భేదాలు వచ్చినపుడే కొంచెం సేపు లేదా కొన్ని గంటలు ఎడమొఖం పెడముఖంగా ఉన్నా, ముందు ఉక్రోషాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని తప్పెవరిదో కూల్‌గా ఆలోచించుకోవాలి. తప్పెవరిదైనా ఎవరో ఒకరు పట్టుదల సడలించుకుని రాజీకి ప్రయత్నించాలి. 

ఎవరెక్కడ పుట్టిపెరిగినా గతంలో పరిస్థితులు ఎటువంటివైనా ఆలుమగలుగా సంసారం మొదలుపెట్టిన తరువాత ఇద్దరూ వేరు కాదనే నిజాన్ని అన్ని కోణాలనుంచి అర్థం చేసుకోవాలి. భార్యదగ్గర భర్తకు, భర్తదగ్గర భార్యకు భేషజం అనేది ఉండకూడదు. ఎవరెంత ఆత్మాభిమానం కలవారైనా ఆలుమగలు ఒకరిదగ్గర మరొకరు ఆత్మాభిమానం ప్రదర్శించుకోవడం అర్థం లేనిపని, అందుకే అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడే రాజీకి చొరవతీసుకుంటే అదేదో లొంగిపోయినట్టు, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టినట్టుకాదు. 

రాజీకి చొరవ తీసుకుని పట్టు వీడి ఆనంద సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నవేళ అవసరమనుకుంటే అప్పుడే తమ ఉక్రోషాన్ని, దు:ఖాన్ని బయట పెట్టుకోవచ్చు.ఇలా చేయడం వలన కోపతాపాలు పోయి అభిమానం రెండింతలవుతుంది. అలా కాకుండా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడే ఎవరికివారే తమ వాదాన్ని బలపరుచుకుని ఆత్మాభిమానంతో మొండిగా కూర్చుంటే ఆ పట్టుదలలు పెరిగి, స్పర్థలు అధికమై పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఆలు మగల మధ్య ఏర్పడే అభిప్రాయ బేధాలు వినేవారికి, చూసేవారికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవి భార్యాభర్తలకు అగ్నిపర్వతాల్లా అనిపిస్తాయి.చివరికి అగ్ని పర్వతం బద్దలైనట్టు అవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఆలుమగల సంబంధాలు ఒక్క గొడవ మూలంగానో, ఒక్క కారణం చేతనో దెబ్బతినవు. కాబట్టి తరచూ ఏర్పడే గొడవలకు ఇద్దరూ కారణమవుతారు. మనస్పర్థలు ఏర్పడిన ఆలు మగలు ఒకరిపై ఒకరు చేసుకొనే ప్రధాన ఫిర్యాదు ”అస్సలు మాట వినిపించుకోరని”. ఈ సమస్యకు పరిష్కారం చాలా తేలిక. ఒక మాట చెప్పినపుడు వినిపించుకోనప్పుడు కోపం తెచ్చుకోకుండా సరైన సందర్భం చూసుకుని అలవోకగా అదే మాట చెప్తే పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తుంది. ఈ సైకాలజీని ఆలుమగలు గ్రహించాలి. స్త్రీ, పురుష అహంకారాలు, పుట్టింటి వారి ఆర్థిక బేదాలు, శరీర రంగులు తేడాలు, ఇతర హోదాలు అలుమగలు పోల్చుకోవటమంత బుద్ది తక్కువ తనం మరొకటి ఉండదు. స్వీట్‌ హోంలా పోల్చదగ్గ కాపురంలో వాటికి తావుండకూడదు. ఏదో ఒక సందర్భంలో భార్యను భర్త విసుక్కున్నా, భర్తని భార్య విసుక్కున్నా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని, మనస్సు కష్టపెట్టుకోకుండా సరిపెట్టుకోవాలి. అవసరమైతే సహకరించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కష్టపెట్టినందుకు తమకు తామే ఎంతో నొచ్చుకుని మరింత దగ్గరవుతారు. అలానూ గాకుండా ప్రతిమాట పట్టించుకుని పంతం ప్రదర్శించే వారైతే ఆ చిన్న సమస్య పెరిగి పెద్దదవుతుంది. 

ఆలుమగలు పరస్పర భావోద్రేకాలను, శారీరక మానసిక అవసరాలను గురించి అవగాహన గలిగినప్పుడే ఆ సంసారంలో అనురాగమే తప్ప, అపార్థానికి తావుండదు. ఏమైనా చిన్న చిన్న చికాకులు ఏర్పడినా వాటంతటవే సర్దుకుపోతాయి. ప్రేమ సామ్రాజ్యంలో లొంగిపోవటమే గొప్ప తప్ప, ఆధిక్యత ప్రదర్శించటం ఏమాత్రం గొప్పకాదనేది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని పాటించిన ప్రతి ఇల్లూ స్వీట్‌ హోమ్‌ అవుతుంది. అటువంటి అభిప్రాయం ఒకరికి ఉండి మరొకరిని మార్చటం సాధ్యం కానప్పుడు, ఆ విషయం బయట పెట్టకుండా ఒక మంచి సందర్భం చూసుకుని, ఇరువురూ చర్చించుకుని కౌన్సిలింగ్‌లో సలహా తీసుకోవచ్చు. ఇలాంటి కౌన్సిలింగ్‌ ఏమాత్రం తప్పుకాదు. ఆలుమగలు madhya అనురాగానికి, ఆగ్రహానికి తేడా చాలా తక్కువ . ఆలుమగల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రసక్తి ఉండకూడదని గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది. జీవపరిణామ క్రమములో మగవాడు ముందు ... తరువాత ఆడుది పుట్టినవి అయినందున మూర్ఖత్వము  కొన్ని జంతులక్షణాలు మగవారికే ఉంటాయి. కావున స్త్రిలే సర్దుకు పొవాలి. భర్తకు ఇత్ష్టము లేనిది భార్యకు ఎంత ఎష్టమైనా వదుకోవడమే ఉత్తమము మరియు అలా గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది.

ఫలప్రదమైన అనుబంధాలు చాలా వరకు అర్థవంతమైన సంభాషణల మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సంభాషణలు సహజంగా, దాపరికం లేకుండా సాగాలి. అలా చర్చించుకోవలసినవి.

కెరీర్ : దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్నా, కొంతమంది జీవిత భాగస్వామికి తమ సమస్యేమిటో చెప్పే ప్రయత్నమే చేయరు. నిజానికి సంస్థలు వేరు వేరయినా, చాలా సార్లు ఆ సమస్యలు ఒకేలా ఉంటాయి. అందుకే జీవిత భాగస్వామి నుంచే ఒక గొప్ప పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.

ఆర్థిక విషయాలు : కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఉమ్మడిగా చర్చించుకోవడం ద్వారా, ఎన్నో సమస్యలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. కుటుంబానికి సంబంధించి, అప్పులు, ఆదాయాలు ఇలా అన్ని విషయాలూ ఇద్దరికీ పూర్తిగా తెలిసి ఉండడం వల్ల, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించడం సులువవుతుంది.

కుటుంబ బంధాలు : దంపతులిద్దరూ పరస్పరం రెండు కుటుంబాల విషయాల్లో బా«ధ్యతగానే ఉండాలి. ఇది దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి గౌరవ భావం పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది.

హాబీలూ ముఖ్యమే : ఎంతసేపూ కుటుంబ నిర్వహణ విషయాలకే పరిమితం కాకుండా, తమ తమ హాబీల విషయంలోనూ పరస్పరం చర్చించుకోవడం ఎంతో మేలు. దీనివల్ల ఒకరి పురోగతికి మరొకరు తోడ్పాటును, ప్రోత్సాహాన్నీ అందించినట్లు అవుతుంది.

భవిష్యత్తు పై ఒక భరోసా : కొందరిని భవిష్యత్తు గురించిన ఒక అభద్రతా భావం కుదిపేస్తూ ఉంటుంది. ఒక పక్కా ప్రణాళిక ఏదీ లేకపోవడమే దీనికి కారణం. అందుకే,భవిష్యత్తు గురించిన ఒక నిశ్చింత ఏర్పడే ఆలోచనా క్రమం నిరంతరం సాగాలి. అందుకే భవిష్యత్తు విషయాలపై కూడా దృష్టి నిలపడం ఏ జంటకైనా ఎంతో ముఖ్యం.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1005,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1536,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,63,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 2023
HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 2023
HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా? HOW TO SOLVE DIFFERENCES IN A COUPLE 2023 ఆలుమగలు ఎలాంటి అరమరికలు, అపార్
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcI-ACjPfCYuklsAjwjQhE4Zzz0Qgn6MWo-v9ck60MdXc00F759_IGEvQ2m_1B232CP0MwzOH2-_SKEvV8d9uoYca_DL8Q1xzMETf5Kr8sokxgSaO0VjH3qr6NMoruTG25oy0tBB3XOUX9kBPTGaBXjJtQzyQOMFcIjyzGy1ZNuEAJf24MJppmrWLjUA/w400-h398/mono.PNG
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcI-ACjPfCYuklsAjwjQhE4Zzz0Qgn6MWo-v9ck60MdXc00F759_IGEvQ2m_1B232CP0MwzOH2-_SKEvV8d9uoYca_DL8Q1xzMETf5Kr8sokxgSaO0VjH3qr6NMoruTG25oy0tBB3XOUX9kBPTGaBXjJtQzyQOMFcIjyzGy1ZNuEAJf24MJppmrWLjUA/s72-w400-c-h398/mono.PNG
ApTeachers9
https://www.apteachers9.com/2023/01/how-to-solve-differences-in-couple-2023.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2023/01/how-to-solve-differences-in-couple-2023.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content