GATE 2023

 GATE 2023

గేట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. 2023 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల తేదీ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

గేట్‌ 2023 పరీక్షకు సిద్ధమవుతోన్న అభ్యర్థులకు అలర్ట్‌. గేట్‌ 2023 అడ్మిట్ కార్డులను సోమవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గేట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జవనరి 09, 2023 నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిజానికి తొలుత జనవరి 3వ తేదీన అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా కొత్త తేదీని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. గేట్ పరీక్ష 2023కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చసుకోవచ్చు. 

GATE 2023

ఇదిలా ఉంటే గేట్‌ 2023 పరీక్షను ఫిబ్రవి 4,5,11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న పరీక్ష కీ విడుదల చేయనున్నారు. కీ పేపర్‌పై అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఫలితాలను మార్చి 16న విడుదల చేయనున్నారు. స్కోర్ కార్డును మార్చి 21 నుంచి అందుబాటులో ఉంతుతారు. ఇక అడ్మిట్‌ కార్డ్‌ను సోమవారం ఉదయం విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* మందుగా ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న గేట్‌ 2023 అడ్మిట్ కార్డ్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత ఓపెన్‌ అయిన పేజీలో లాగిన్‌ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* వివరాలను ఎంటర్‌ చేసిన సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌పై చేయాలి.

* వెంటనే అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

* భవిష్యత్తుల అవసరాల దృష్ట్యా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

FOR DOWNLOAD ADMIT CARD CLICKHERE

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post