FAKE NOTES IDENTIFICATION 2024
500 నోటు.. ఒరిజినలా..? నకిలీదా..? ఎలా తెలుసుకోవడం?
కొత్త కరెన్సీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత నకిలీ నోట్ల బెడద తగ్గిందనుకున్నా..మళ్లీ నకిలీలు చలామణిలోకి వస్తున్నాయి. ఎక్కువగా పెద్దనోట్లలోనే నకిలీలు కనిపిస్తాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామ వాలంటీర్ వృద్ధులకు ఇచ్చే పింఛనులో నకిలీ నోట్లను పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. అసలు ఈ నోట్లలో అసలుకు, నకిలీకి తేడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
నకిలీ నోట్లను పైపైనా చూసి గుర్తించడం కష్టమే. కానీ, కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అసలేదో.. నకిలీదేదో తెలిసిపోతుంది. అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ నోటు ఏ విధంగా ఉంటుందో.. తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.
500 ఒరిజినల్ నోటు ఎలా ఉంటుందంటే...
* ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 సంఖ్య కనిపిస్తుంది.
* నోటుని 45 డిగ్రీల కోణంలో వంచి చూసినట్లయితే.. నోటు కిందిభాగంలో ఉన్న ఆకుపచ్చ స్ట్రిప్‌లో 500 సంఖ్యని గమనించవచ్చు.
* స్ట్రిప్ పైన 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది.
* నోటు మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రపటం కనిపిస్తుంది.
* నోటును వంచి చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే భద్రతా తీగ.. నీలంలోకి మారుతుంది.
* భద్రతా తీగ కుడివైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం, దానికింద ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
* దాని పక్కనే 500 సంఖ్య ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్‌ను గమనించొచ్చు.
* నోట్ల సిరీస్‌ను తెలియజేసే సంఖ్యలు కుడివైపు కిందిభాగంలో ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ కనిపిస్తాయి.
* నోటు కుడివైపు కిందిభాగం చివరన భారత జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ ఉంటుంది.
* వెనక భాగంలో ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
* స్వచ్ఛభారత్ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
* దేశంలోని 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
* లాంగ్వేజ్ ప్యానెల్ పక్కనే దిల్లీలోని ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.
* వీటిని పరిశీలించిన తర్వాత మీ వద్ద ఉన్న నోటు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఏదైనా బ్యాంకు సిబ్బందిని సంప్రదించింది.. అసలుదా.. నకిలీదా నిర్థారించుకోండి.
COMMENTS