DEMAT ACCOUNT 2023
డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఈ విషయాలు తెలుసుకోండి
ఒక పెట్టుబడిదారు స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేస్తారు. ఒక ఈక్విటీ పెట్టుబడిదారు పెట్టుబడి కోసం ఇది ఆరంభ దశ. డీమ్యాట్ ఖాతా షేర్లు, సెక్యూరిటీస్‌ను డీమెటీరియలైజ్డ్ లేదా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉంచే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ ఖాతా ముఖ్య ఉద్దేశ్యం షేర్ సర్టిఫికెట్లను భౌతిక రూపం నుండి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం. ఇది ఉత్తమ యాక్సెసబులిటీస్ కల్పిస్తుంది.
- డీమ్యాట్ అకౌంట్‌ను ఇలా ఓపెన్ చేయవచ్చు.
- డీమ్యాట్ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి మొదటి, ప్రధానమైన దశ డిపాజిటరీ పార్టిసిపెంట్‌ను (DP)ని ఎంచుకోవడం. DP సేవలను అందించడానికి బ్యాంకులు లేదా స్టాక్ బ్రోకర్లు, లేదా ఆన్‌లైన్ పెట్టుడి ప్లాట్‌ఫామ్స్ మన దేశంలో ఉన్నాయి.
- DP వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. వెబ్ సైట్‌లో వారు ఆన్‌లైన్ డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయడానికి ఫారం ఉంటుంది. పెట్టుబడిదారు ఆ ఫారంను పూర్తి చేయాలి. కొన్ని డిపాజిటరీలు ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఆఫర్ చేస్తాయి. అకౌంట్ నిర్వహణ కోసం ఫీజులు, ఛార్జీలను అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడిదారు తన నామినీ పేరును కూడా పేర్కొనాలి. డీమ్యాట్ అకౌంట్‌ను ట్రేడింక్ ఖాతాను లింక్ చేయడం ముఖ్యం. స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ చేయడానికి ట్రేడింగ్ అకౌంట్ అవసరమైన సాధనం.
వీటికి ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
డీమ్యాట్ అకౌంట్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఇన్వెస్టర్లు 'నో యువర్ కస్టమర్'(KYC) నిబంధనలు పూర్తి చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్, ఇన్‌కం ప్రూఫ్ వంటివి సమర్పించవలసి ఉంటుంది. వీటికి సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం. ప్రామాణికత కలిగిన పాన్ కార్డు, ఆధార్ కార్డు.. ఈ రెండు కూడా ఈ దశకు ముఖ్యమైన డాక్యుమెంట్స్.
అడ్రస్ ప్రూఫ్‌కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వోటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటి వాటిని ఉపయోగించవచ్చు. బ్యాంకు ఖాతా పాస్‌బుక్ కాపీ లేదా మూడు నెలల లోపు బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీ అవసరం. తాజా వేతన స్లిప్స్, ఐటీ రిటర్న్స్ వంటి ఆదాయ రుజువు పత్రాలు అవసరం. కరెన్సీ, డెరివేటివ్స్ విభాగానికి ఐటీ రిటర్న్స్ తప్పనిసరి.
కీలకమైన ప్రక్రియ
నాలుగో, అత్యంత ముఖ్యమైన, తప్పనిసరి దశ ఇది.. ధృవీకరించడం. ఈ ప్రక్రియను ఇన్-పర్సన్ వెరిఫికేషన్(IPV) అంటారు. చాలా DPలు ఈ ప్రక్రియను కంప్యూటర్, స్మార్ట్, వెబ్ క్యామ్‌లలో పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో DPలు పెట్టుబడిదారును వారి కార్యాలయంలో ఉండమని కూడా అడగవచ్చు. అయితే ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా తప్పుడు సమాచారాన్ని నివారించవచ్చు.
ఒప్పందం
తర్వాత ప్రక్రియ సులువైనది. పెట్టుబడిదారు అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం DPతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ఒప్పందంలో DP, పెట్టుబడిదారు విధులు, హక్కులు ఉంటాయి.
ఒప్పందంపై సంతకాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత DP ద్వారా అన్నీ చెక్ చేయబడతాయి. ఆ తర్వాత ప్రాసెస్ అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ సరైనవిగా ఉంటే అప్రూవ్ అవుతుంది. అప్పుడు పెట్టుబడిదారుకు ప్రత్యేక ప్రయోజన గుర్తింపు సంఖ్య లేదా BO-ID వస్తుంది. ఆన్‌లైన్‌లో డీమ్యాట్ ఖాతాను యాక్సెస్ చేయడానికి BO-ID ఉపయోగించబడుతుంది.
COMMENTS