BANK OF MAHARASHTRA RECRUITMENT 2023
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.78,230ల జీతం..
పూణె ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో పని చేయడానికి.. 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 2 & 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు దారుల వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ.1180లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన వారు రూ.118లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు స్కేల్-3 పోస్టులకైతే రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు.
స్కేల్ 2 పోస్టులకు రూ.48,170ల నుంచి రూ.69,810ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
ఎకనామిస్ట్ పోస్టులు: 2
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు:3
సివిల్ ఇంజినీర్ పోస్టులు: 10
లా ఆఫీసర్ పోస్టులు: 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 4
డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్ పోస్టులు: 50
బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 2
ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు: 15
రాజభాష ఆఫీసర్ పోస్టులు: 10
హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు: 5
డేటా అనలిటిక్స్ పోస్టులు: 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3) పోస్టులు: 11
డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్ పోస్టులు: 5
ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 10
మొబైల్ యాప్ డెవలపర్ పోస్టులు: 10
డాట్ నెట్ డెవలపర్ పోస్టులు: 10
జావా డెవలపర్ పోస్టులు: 10
క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్ పోస్టులు: 5
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 5
యూనిక్స్/లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 20
నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 6
విండోస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 4
వీఎంవేర్/ వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 1
మెయిల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఈఎఫ్‌టీ స్విచ్ పోస్టులు: 4
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ యూపీఐ స్విచ్ పోస్టులు: 8
విండోస్ డెస్క్‌టాప్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్ పోస్టులు: 4
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS