BANK LOCKER KEY 2023
బ్యాంకు లాకర్ కీని పోగొట్టుకున్నారా? వెంటనే ఇలా చేయండి
బ్యాంకు లాకర్లో విలువైన వాటిని దాచుకుంటారు. బంగారం, ఆస్తి పత్రాలు వంటి వాటిని భద్రపరిచేందుకు బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు. లాకర్ తీసుకున్న తర్వాత ఇందుకు సంబంధించిన ఒక కీని అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. అయితే ఆ లాకర్ కీని పోగొట్టుకుంటే బ్యాంకులు మరో కీని లేదా డూప్లికేట్ కీని అందిస్తాయి. అయితే ఇందుకు బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి. యజమానికి జరిమానా విధించడంతో పాటు, డూప్లికేట్ కీకి ఛార్జ్ చేస్తారు. బ్యాంకు లాకర్ కీ కనుక పోగొట్టుకుంటే ఏం చేయాలి?
కీ పోగొట్టుకుంటే ఖర్చు తప్పదు
సాధారణంగా బ్యాంక్ లాకర్ ప్రారంభిస్తే రెండు కీలు ఉంటాయి. ఒకటి ఖాతాదారు వద్ద, రెండోది బ్యాంకు వద్ద ఉంటుంది. అకౌంట్ హోల్డర్ వద్ద ఉన్న అనుకోని పరిస్థితుల్లో పోగొట్టుకుంటే మొదట బ్యాంకు మేనేజర్‌కు సమాచారం ఇస్తూ లేఖ రాయాలి. అప్పుడు లాకర్‌ను మరొకరు తెరవకుండా జాగ్రత్త పడతారు. లాకర్ కీ పోయినట్లు బ్యాంకుకు సమాచారం ఇస్తే కొత్త లాకర్‌తో పాటు తాళాలను కేటాయిస్తారు లేదా డూప్లికేట్ కీ ఇస్తారు. లాకర్ తెరిచేందుకు శిక్షణ పొందిన వారు బ్యాంకు కార్యాలయానికి వచ్చి బ్యాంకు అధికారి, లాకర్ కలిగిన వ్యక్తి సమక్షంలో లాకర్‌ను తెరుస్తారు. సదరు వ్యక్తి అందుబాటులో లేకుంటే బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ లాకర్లోని పత్రాలు లేదా నగదు లేదా బంగారాన్ని అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. ఈ ప్రక్రియకు రూ.3వేల వరకు ఖర్చవుతుంది.
లాకర్ సైజ్‌ను బట్టి కూడా మీరు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. చిన్న లాకర్ అయితే రీప్లేస్మెంట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. పెద్ద లాకర్ అయితే ఎక్కువగా ఉండవచ్చు.
లాకర్ రెంట్ మాత్రమే కాదు
మీరు ఏదైనా బ్యాంకులో లాకర్ తెరిచినప్పుడు లాకర్ అద్దె మాత్రమే కాదు. చాలా బ్యాంకులు బ్రేకింగ్ ఛార్జీల కోసం అడ్వాన్స్‌తో పాటు మూడేళ్ల అద్దెను వసూలు చేస్తాయి. లాకర్‌ను బ్రేక్ చేయాల్సిన అత్యవసరం కోసం ఈ ముందస్తు ఛార్జీలు వసూలు చేస్తాయి. అవసరమైతే అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్బీఐ.. బ్యాంకులకు అనుమతిచ్చింది. అయితే చాలా బ్యాంకులు అవసరమైతే లేదా కొంత కాలం తర్వాత మాత్రమే ఈ ఛార్జీని వసూలు చేస్తున్నాయి.
జాగ్రత్తగా ఉండాలి
లాకర్ తెరిచినప్పుడు రెండు కీలు ఉంటాయనే విషయం గుర్తించాలి. వ్యక్తి తన లాకర్ కోసం ఎలాంటి అనుబంధ లేదా నకిలీ కీని పొందలేరు. కాబట్టి కీని జాగ్రత్తగా దాచుకోవడం మంచిది. అయితే అనుకోని విధంగా కీని కోల్పోతే బ్యాంకు మేనేజర్‌కు లేఖ రూపంలో సమాచారం ఇవ్వాలి.
మీరు మీ కీ పోగొట్టుకుంటే వెంటనే దానిని బ్యాంకుకు తెలియజేయాలి. లేదంటే మీ కీని దొంగిలించిన వ్యక్తి మీ లాకర్లోని కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయగలడు.
COMMENTS