Bank Strike: Alert to SBI customers.. Banks will be closed for three consecutive days..!
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
Bank Strike: కస్టమర్లకు అలర్ట్.. మీకు బ్యాంకులో ఏదైనా పని ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. దీనివల్ల ఆ పనులు పూర్తి చేసుకోవటం కోసం మీరు ఎక్కువ కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
బ్యాంక్ సెలవులు..
జనవరి 29 ఆదివారం కావటంతో బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తర్వాత జనవరి 30, 31 కూడా సమ్మే కారణంగా బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి. దీనికోసం బ్యాంకు యూనియన్లు, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) జనవరి 30 నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని చెబుతూ అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుందని తెలుస్తోంది.
సమ్మెతో నష్టం..
సమ్మె రోజుల్లో బ్యాంకు తన శాఖలు, కార్యాలయాల సాధారణ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు SBI తెలిపింది. కానీ సమ్మె జరిగితే పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమ్మె కారణంగా వచ్చే నష్టాన్ని లెక్కించలేమని బ్యాంకు తెలిపింది. దీంతో సోమవారం, మంగళవారం బ్యాంకు సేవలు పొందాలనుకునే వారు ముఖ్యమైన పనులను దీనికి ముందే పూర్తి చేసుకోవటం ఉత్తమం. స్టేట్ బ్యాంక్ సైతం తన ఖాతాదారులకు ఇదే విషయాన్ని చెబుతోంది.
Post a Comment