An income of Rs. 17 lakhs from pepper crop.. A farmer's success story
మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఓ రైతు విజయగాథ
Black Pepper Farming: మిరియాల సాగు ద్వారా మారక్ కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. 2019లో తన తోటలో రూ.17 లక్షల విలువైన మిరియాలను ఉత్పత్తి చేశాడు. ఆయన సంపాదన రోజురోజుకూ పెరుగుతోంది.
డబ్బు బాగా రావాలంటే ఏం చేయాలి? ఏదైనా మల్టీ నేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగమైనా ఉండాలి? లేదంటే వ్యాపారమైనా చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ వ్యవసాయం చేసి కూడా లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా.. సేద్యం చేస్తూ.. ఎంతో మంది రైతులు భారీగా ఆదాయం పొందుతున్నారు. మీ కోసం అలాంటి ఐడియానే (Business Ideas) తీసుకొచ్చాం. మనదేశంలో మిరియాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర దేశాల్లో కూడా భారీగా ధర పలుకుతోంది. మేఘాలయ(Meghalaya)కు చెందిన నానాద్రో బి. మారక్ (Nanadro b Marak) అనే రైతు మిరియాలు పండిస్తూ (Black Pepper Farming).. భారీగా ఆదాయం పొందుతున్నారు. 5 ఎకరాల భూమిలో మిరియాలను సాగు చేస్తున్నారు. ఆయన విజయాన్ని చూసి.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
నానాద్రో బి. మారక్ కరి ముండా రకానికి చెందిన మిరియాలను పండిస్తున్నారు. పంటుసాగుకు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడుకుండా.. సేంద్రీయ ఎరువులను వాడుతున్నారు. తొలి దశలో రూ.`10వేలు ఖర్చుచేసి.. సుమారు 10 వేల మిరియాల మొక్కలను నాటారు. ఆ తర్వాత క్రమంగా పంటను విస్తరించారు. వీరు పండించే మిరియాలు మంచి నాణ్యతవి కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. నానాడో మారక్ ఇల్లు ల్లు వెస్ట్ గారో హిల్స్ కొండలలో ఉంది. ఎవరైనా ఈ ప్రాంతానికి వెళ్తే.. నల్ల మిరియాలు వంటి సుగంద ద్రవ్యాల సువాసన వారికి స్వాగతం పలుకుతుంది.
గారో హిల్స్ కొండ కోనలతో కూడిన అటవీ ప్రాంతం. చెట్లను నరకకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా... ఇక్కడ మిరియాల సాగు చేస్తున్నారు నానాడో మారక్. మిరియాల సాగుకు రాష్ట్రవ్యవసాయ, ఉద్యానవనశాఖ పూర్తి సహకారం అందించారు. మారక్ మిరియా సాగులో విజయవంతమవడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా దీని పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇతర రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు.
నానాద్రో మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. పొలంలో 8-8 అడుగుల దూరంలో నల్ల మిరియాలు మొక్కలను నాటాలి. రెండు మొక్కల మధ్య అంత దూరం ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొక్కలు పెరగడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక చెట్టు నుంచి మిరియాలను తీసిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మిరియాల గింజలను నీటిలో కొంతసేపు ముంచి.. ఆ తర్వాత ఎండబెట్టాలి. అప్పుడే గింజలకు మంచి రంగు వస్తుంది. కాస్త శ్రద్ధ పెట్టి.. అంకితభావంతో.. మిరియాల సాగు చేస్తే.. సంప్రదాయ పంటల కంటే.. అనేక రెట్లు అధిక ఆదాయం పొందుతారని తెలిపారు.
మిరియాల సాగు ద్వారా మారక్ కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. 2019లో తన తోటలో రూ.17 లక్షల విలువైన మిరియాలను ఉత్పత్తి చేశాడు. ఆయన సంపాదన రోజురోజుకూ పెరుగుతోంది. నానాద్రో బి. మారక్ వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషి, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆయన్ను అభినందించింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచినందుకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మారక్‌కు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
COMMENTS