WhatsApp: Does WhatsApp have a Facebook Messenger feature? These are the most recent update details.
WhatsApp: వాట్సాప్‌లో ఫేస్‌బుక్ మెసెంజర్ ఫీచర్? ఈ లేటెస్ట్ అప్‌డేట్ డీటైల్స్ ఇవే..
WhatsApp : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్(WhatsApp) కొత్త కొత్త అప్‌డేట్‌లను అందిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్.. యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తోంది. గత నెల రోజులుగా కొత్త ఫీచర్‌లను యాడ్ చేస్తోంది. ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్(WhatsApp new feature)తో ముందుకొచ్చింది. ఈ అప్‌డేట్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెసేజ్ పక్కన ప్రొఫైల్ పిక్చర్
ఈ లేటెస్ట్ అప్‌డేట్ తర్వాత ఫేస్‌బుక్ మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న యూజర్ మెసేజ్(Message) పక్కనే వారి ప్రొఫైల్ పిక్చర్(Profile Picture) కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైనా వాట్సాప్ చాట్‌లో కేవలం పేరు మాత్రమే కనిపిస్తుంది. యూజర్ ఏదైనా టెక్స్ట్‌ని పంపిన ప్రతిసారీ, వినియోగదారు సేవ్ చేసినట్లుగా, కాంటాక్ట్ నేమ్ కింద పంపిన మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో, గ్రూప్ చాట్‌లో మెసేజ్ పంపిన పార్టిసిపెంట్ ప్రొఫైల్ పిక్చర్‌ను వినియోగదారులు చూడగలరు. ఈ గ్రూప్‌చాట్ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ తన వినియోగదారులందరికీ త్వరలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
డిసప్పియరింగ్ మెసేజెస్ షార్ట్‌కట్ బటన్
వాట్సాప్ కంపెనీ డిసప్పియరింగ్ మెసేజెస్ షార్ట్‌కట్ బటన్ టెస్టింగ్ ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్‌డేట్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ షార్ట్‌కట్ బటన్ ఆప్షన్‌ను రీడిజైన్ చేయనుంది. న్యూ, ఓల్డ్ చాట్‌లను డిసప్పియరింగ్ థ్రెడ్‌లుగా గుర్తించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డిసప్పియరింగ్ మెసేజెస్ సెక్షన్ 2.22.25.10 అప్‌డేట్ ద్వారా మరింత మంది టెస్టర్‌లకు అందుబాటులోకి వస్తుంది. ఆసక్తికరంగా మెసేజింగ్ యాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ కోసం అదనపు ఎంట్రీ పాయింట్‌ను లాంచ్ చేస్తోంది.
WABetaInfo నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్ వీడియో కాల్‌లో ఉండగా మరో యాప్‌ను ఉపయోగించే అవకాశం లేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌తో ముందుకు వస్తోందని చెప్పింది. వీడియో కాల్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఆప్షన్‌ను వాట్సాప్ అందిస్తోందని తెలిపింది. దీని ద్వారా వినియోగదారులకు బెస్ట్ వీడియోకాల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వాట్సాప్ అకౌంట్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేస్తే.. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మరో యాప్‌ను కూడా ఓపెన్ చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని WABetaInfo పేర్కొంది.
COMMENTS