Users of Android and iOS now have access to WhatsApp's polling feature.
వాట్సప్ యూజర్లకు కొత్తగా ‘పోల్ ఫీచర్’ - పోల్స్ క్రియేట్ చేసే విధానం ఇదే
వాట్సప్ కమ్యూనిటీస్ (WhatsApp Communities) ఫీచర్‌ను గతవారం రిలీజ్ చేసిన మెటా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను యాడ్ చేసినట్లు ప్రకటించింది. వాట్సప్ గ్రూప్స్‌లో పోల్స్ ఫీచర్‌ని (Whatsapp Polls Feature) పరిచయం చేసింది. ఏదైనా అంశంపై గ్రూప్‌లో పోల్ నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్ చేసి గ్రూప్స్‌లో పోల్స్ ఫీచర్ ఉపయోగించవచ్చు.
వాట్సప్ పోల్స్ ఫీచర్‌ని గ్రూప్‌లోని సభ్యులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. తాము ఉన్న గ్రూప్‌లో పోల్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ ఫీచర్ కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే కాదు. గ్రూప్ సభ్యులు కూడా పోల్ క్రియేట్ చేసే అవకాశం కల్పిస్తోంది మెటా. ఏదైనా ఒక అంశంపై గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పోల్ క్రియేట్ చేస్తే 12 ఆప్షన్స్ ఉంటాయి. యూజర్లు తమకు కావాల్సిన ఆప్షన్స్ సెట్ చేయొచ్చు. గ్రూప్‌లో పోల్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ మెంబర్స్ తమకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఆ పోల్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయన్నది వెంటనే తెలిసిపోతుంది. మరి వాట్సప్ గ్రూప్‌లో పోల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి.
పోల్ ఎలా క్రియేట్ చేయాలి:
వ్యక్తిగతంగా, గ్రూపులోనూ పోల్ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. 12 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
- ఇందుకోసం వాట్సాప్ చాటింగ్ ను ఓపెన్ చేసి అటాచ్ బటన్ ను నొక్కాలి.
- అక్కడ పోల్ ఆప్షన్ కనపడుతుంది. దానిని క్లిక్ చేయాలి.
- అందులో మీకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేసి.. దానికి ఆపన్లు ఇవ్వాలి.
- ఆ తర్వాత ‘సెండ్’ బటన్ మీద క్లిక్ చేయాలి.
- దానితో గ్రూప్‌లో పోల్ క్రియేట్ అవుతుంది.
COMMENTS